Eluru: జూలై, 10… సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) నియమనిబంధనల ప్రకారం 2021లో దత్తతకు ధరఖాస్తు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంనకు చెందిన సురేంధర్, మహాలక్ష్మి దంపతులకు ఏలూరు శిశు గృహంలో ఆశ్రయం పొందుచున్న 3 నెలలు వయస్సు గల మనోజ్ అనే బాబును జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమక్షంలో కెఐఎఎస్ వారి ద్వారా దత్తత తల్లిదండ్రులకు బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో అందజేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ చంటిపిల్లలను నిరాదరించే తల్లులు ఆ చిన్నారులను ఎక్కడో కాల్వల్లోను, చెత్తకుప్పల్లోను పడవేయకుండా శిశు గృహంలో అప్పగించినచో వారిని సంరక్షించేందుకు ముందుకు వచ్చే వారికి చట్టప్రకారం దత్తత ఇవ్వడానికి అవకాశం కలుగుతుందన్నారు. దత్తత పొందిన పిల్లలను జాగ్రత్తగా పెంచాలని, విద్యాభోదనలు చెప్పించి ఉన్నతమైన స్ధానంలోకి తీసుకురావాలని తల్లిదండ్రులకు తెలిపారు. వీరిపై పర్వవేక్షణ ఉంటుందని, అలాగే ప్రతి ఆరు నెలలకు జిల్లా బాలల సంరక్షణ కార్యాలయ సిబ్బంది గృహ సందర్శన చేసి పిల్లల మానసిక శారీరక ఎదుగుదల ను రిపోర్ట్ రూపంలో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ వారి కారింగ్స్ పోర్టల్ నందు అప్ లోడ్ చేస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు .
ఈ కార్యక్రమములో జిల్లా మహిళా , శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ అధికారి కె.ఎ.వి.ల్ పద్మావతి , జిల్లా బాలల సంరక్షణ అధికారి డా. సిహెచ్ సూర్యచక్రవేణి, తదితరులు పాల్గున్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in