EluruEluru
0 0
Read Time:7 Minute, 12 Second

Eluru:జూలై,10:మానవతా ధృక్పదంతో కౌలు రైతులు, వీధి వ్యాపారులు, ఎస్ హెచ్ జి గ్రూపుల ఆర్ధిక తోడ్పాటుకు సులభంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లకు సూచించారు.

బుధవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో 2024-25 మొదటి త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా రుణాల లక్ష్యసాధనపై బ్యాంకర్లతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా రుణ ప్రణాళిక లక్ష్యం రూ. 18,256 కోట్ల రూపాయులుగా నిర్ధేశించడం జరిగిందని లక్ష్యాలు సాధించే విధంగా అధికారులు దృష్టిసారించాలన్నారు. సిసిఆర్ సి కార్డులు కలిగిన కౌలు రైతులకు సులభరీతిలో రుణాలు అందించడంపై దృష్టిపెట్టాలన్నారు. పిఎం స్వానిధి అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టి లభ్దిదారుల్లో అవగాహన కల్పించాలన్నారు. రుణంకోసం ఆసక్తిచూపుతున్న లబ్దిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పధకాలకు సంబందించి బ్యాంకర్ల వద్దనున్న ధరఖాస్తులను పరిష్కరించి వారికి ఆర్ధిక తోడ్పాటును అందించాలన్నారు. ఒకవేళ ధరఖాస్తులు తిరస్కరించే సమయంలో అందుకుగల తగు కారణాలను స్పష్టంగా తెలియజేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి ఆయా పధకాల కింద పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆయా ధరఖాస్తుల్లో లోటుపాట్లు వుంటే సంబంధిత అధికారులను సమన్వయంచేసుకొని నిబంధనలమేరకు వాటిని పూర్తిచేయడం ద్వారా లబ్దిదారులకు రుణాలు అందించేందుకు మార్గం సుగమం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆయా పధకాల వారీగా ఆయా బ్యాంకులకు నిర్ధేశించిన లక్ష్యసాధనపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా రుణాలను విరివిగా అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్ధిక చేకూర్పు, ఆర్ధిక అక్షరాస్యతపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కలిగించేందుకు నిర్ధేశించిన కార్యక్రమాలను నూరుశాతం పూర్తిచేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ప్రధానమంత్రి ముద్రాయోజన కింద రుణాలు మంజూరుపై పూర్తిదృష్టి సారించాలన్నారు. యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇస్టిట్యూట్ ద్వారా మరిన్ని ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ద్వారకాతిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రసాదల పంపిణీకి వినియోగించే విస్తర్లు వంటివి తయారీపై గిరిజన ప్రాంతాల్లో మహిళలకు శిక్షణనిచ్చి ఆర్ధిక సహాయం అందించడం ద్వారా వారి జీవనోపాధికి దోహదపడాలని సూచించారు. ఆవులు,గేదెల యూనిట్ల ఏర్పాటుకు విరివిగా రుణాలు అందించాలని, ఈ విషయంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులో ఏమైనా లోపాలువుంటే లబ్దిదారుకు అవగాహన కల్పిస్తూ తిరిగి బ్యాంకర్లకు అందించడంలో చొరవ చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు మండల వారీగా క్యాంపు లు నిర్వహించి ఆసక్తి గల అర్హులైన లబ్ధిదారులతో దరఖాస్తు చేయించాలని పశు సంవర్థకశాఖ జెడి ని ఆదేశించారు. వివిధ పధకాల లక్ష్యాల సాధనలో కొన్నిబ్యాంకుల పురోగతిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్టాండ్ అప్ ఇండియా పై వర్క్ షాప్….
ఆంట్రప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న స్టాండ్ అప్ ఇండియా పధకంపై క్షేత్రస్ధాయిలో విస్త్రృతంగా అవగాహన కల్పించే దిశగా సంబంధిత అధికారులు, బ్యాంకర్లు, సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించాలన్నారు. ఇదే సమయంలో ఈ పధకం కింద లబ్దిపొంది ప్రయోజికులైన లబ్దిదారులను వర్క్ షాప్ లో భాగస్వామ్యం చేయాలన్నారు. ఔత్సాహిక లబ్దిదారుల నుంచి ధరఖాస్తులు స్వీకరించి వాటిని బ్యాంకర్లకు పంపాలన్నారు.

బ్యాంకర్లను అభినందించిన కలెక్టర్….

జూలై మాసంలో సామాజిక పెన్షన్ల సొమ్ము విడుదల చేయడంలో బ్యాంకర్ల కృషిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభినందించారు.  ఇదే స్పూర్తితో రానున్న కాలంలోకూడా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. 

సమావేశంలోరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డిఓ పూర్ణిమా, ఎల్ డిఎం డి. నీలాధ్రి, నాబార్డ్ డిడిఎం అనీల్ కాంత్, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, మెప్మాపిడి ఇమ్మానియేల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జియం ఆదిశేషు, వ్యవసాయశాఖ జెడి ఎస్ కె అబీబ్ భాషా, పశుసంవర్ధకశాఖ జెడి జి. నెహ్రూబాబు, ఉధ్యానశాఖ డిడి రామ్మోహన్, వివిధ బ్యాంకుల కో-ఆర్డినేటర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.  

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *