Bhimavaram:గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి తాహాసిల్దార్ కార్యాలయం వరకు చిన్న కుటుంబం చింత లేని కుటుంబం, ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దు వివాహమునకు అమ్మాయి వయసు 21, అబ్బాయి వయసు 25 అనే నినాదాలతో పట్టణంలో చైతన్య ర్యాలీ సాగింది.

ఈ ర్యాలీ జిల్లా రెవిన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం ఒకటని అన్నారు. విపరీతంగా జనాభా పెరుగుదల వలన సహజ వనరులు అంతరించి అనర్థాలకు దారితీస్తుందన్నారు. సుస్థిర అభివృద్ధి, కుటుంబ నియంత్రణ, పేదరికం కోసం సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. మాతృ, శిశు శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ, బిడ్డ బిడ్డకు మధ్య అంతరం ఉండేటట్లు అవగాహన కల్పించే విధంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య, ఉద్యోగాల నైపుణ్యం కోసం జనాభా నియంత్రణ అత్యవసరమని దీని ప్రభావం ఆర్థికాభివృద్ధి పై స్పష్టంగా పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డా: డి. ఉమామహేశ్వరరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి .సుజాత రాణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ డి. సుబ్బలక్ష్మి, జిల్లా గణాంక అధికారి ప్రసాద్, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, భీమవరం మదర్ నర్సింగ్ స్కూల్ స్టూడెంట్స్, మరియు వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in