ముసునూరు/ఏలూరు,జూలై 14:ముసునూరు, మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన ఓబిళ్ళనేని లక్ష్మీనారాయణ, ముల్లంగి, పుల్లయ్య, బొట్ల, జగన్నాధం, వీరు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆదివారం ఇంటింటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు.
మరణించిన పెద్దలందరూ పార్టీకి ఎంతో సేవలు చేసారని వారిని తాను ,మా పార్టీ ఎన్నడికి మరువలేమని వారి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ప్రభుత్వం అదుకుoటుందనీ ఓదర్చారు.
వారి కుటుంబాలకు ఏవిధమైన అవసరం ఉన్నా నన్ను నేరుగా కలిస్తే తగిన సహాయ సహకారం ప్రభుత్వం తరుపున వెంటనే అందజేస్తానని భరోసా ఇచ్చారు. తదనంతరం మరణించిన వారి చిత్ర పటాలకు పూలమాలతో నివాళులు అర్పించారు. మంత్రివర్యులు వెంట గ్రామ పెద్దలు నాయకులు ,స్థానిక నాయకులు వున్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in