Eluru July 15:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా, పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.
సోమవారం స్ధానిక గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్ధాయి శాండ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక డిసిల్టింగ్ కోసం నీటిపారుదల శాఖ సిఇ నుండి ఇసుక సాధ్య, సాధ్యాల నివేదికలను పొందాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉచిత ఇసుక విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేసే దిశగా ఇసుక అక్రమ వెలికితీత, రవాణాచేసే చర్యలను నిరోధించేందుకు జిల్లాస్ధాయి కంట్రోల్ రూమ్ ను మైన్స్ ఎడి కార్యాలయంలో 1800-425-6025 టోల్ ఫ్రీ నెంబరుతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమ, అనధికారిక త్రవ్వకాలపై ఉక్కుపాదం మోపుతూ అటువంటి వాటిని నిరోధించేందుకు నిర్ధేశించిని జరిమానాలకు సంబంధించి విస్త్రృత ప్రచారం కల్పించాలన్నారు. నిషేధిత ప్రాంతాలైన అనగా భూగర్భజల నిర్మాణాలు, వంతెనలు, డ్యామ్ లు, రైల్వే లైన్ల నుండి 500 మీటర్ల లోపల అక్రమ, అనధికార త్రవ్వకాలకు పాల్పడే అవకాశంవున్న ప్రాంతాలను గుర్తించి అటువంటి చోట్ల పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత ఆర్డిఓలు, పోలీస్, సెబ్, మైనింగ్ డిపార్ట్ మెంట్, జిల్లా పంచాయితీ ఈ విషయంలో సమన్వయంతో పనిచేసి గట్టి నిఘా ఉంచాలన్నారు. చట్ట విరుద్ధమైన మైనింగ్, స్టాకింగ్, హోర్డింగ్, అమ్మకం, బ్లాక్ మార్కెట్ కు పాల్పడే వ్యక్తులపై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమాలకు వినియోగంచే వాహనాలను సీజ్ చేయడంతోపాటు జరిమానాలను విధించాలన్నారు. మైన్స్ విభాగానికి ఇసుక సమస్యలపై, ఫిర్యాదులపై అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జిల్లాస్ధాయి టాస్క్ ఫోర్స్ కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. సరైన రశీదు లేకుండా ఇసుక రవాణా జరుగకుండా చూడాలని, ఈ సమయంలో సొంతఇళ్ల నిర్మాణాల కోసం ఇసుక తీసుకువెళ్లే ప్రజలను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. అదే విధంగా డివిజనల్ స్ధాయిలో కూడా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, ఐటిడిఎ పివో యం. సూర్యతేజ, జిల్లా పంచాయితీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, సెబ్ జాయింట్ డైరెక్టర్ ఎన్. సూర్యచంద్రరావు, ఆర్డిఓలు ఎన్ఎస్ కె ఖాజావలి, వై. భవానీశంకరి, కె. అద్దయ్య, మైనింగ్, రవాణా, ఇరిగేషన్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in