Bhimavaram July 8: ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా అధికారులను ఆదేశించారు .
సోమవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ సి.వి ప్రవీణ్ ఆదిత్య, డిఆర్ఓ జె.ఉదయ భాస్కరరావు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి కె.సి.హెచ్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం” నిర్వహించి వివిధప్రాంతాల ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని జిల్లా నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి జిల్లా కేంద్రానికి వస్తుంటారని, వారి పట్ల తగినంత శ్రద్ధ చూపి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలన్నారు. వచ్చిన వినితులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ జరిపి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువు లోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా నలుమూలల నుండి వివిధ ప్రాంతాల ద్వారా వచ్చిన ప్రజలు 129 అర్జీలను సమర్పించారు.
ఈరోజు నిర్వహించిన పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో వచ్చిన కొన్ని వినతలు.
@ పెనుగొండ మండలం చెరుకువాడ గ్రామం నుండి కునపరెడ్డి సుబ్బారావు. తన ఇద్దరు కుమారులు తనను మోసం చేసి స్థలం, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని బయటకు పంపివేశారు నాకు ఎటువంటి ఆధారం లేదు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
@ యలమంచిలి మండలం మేడపాడు గ్రామానికి చెందిన తోట వీరభద్రరావు, 10 సంవత్సరముల క్రితం నా భార్యకు ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వగా వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నవని డాక్టర్లు తెలియజేసినారు. ఏడు సంవత్సరములు వయస్సు వచ్చిన తర్వాత ఒక పాప చనిపోయినది, రెండవ పాప (మాధవి) ఇప్పుడు 10 సంవత్సరములు వయస్సు వచ్చినది, పాపకు ఉన్న అనారోగ్యలు కారణంగా ఆందోళనగా ఉందని కలెక్టర్ కు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యము పొందేలా సంబంధించిన డాక్టర్లకు రిఫర్ చేయాలని జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కీర్తిని ఆదేశించారు.
@ మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామం నుండి పోతునిడి వెంకటేశ్వరావు తనకు ఉన్న భూమి ఆక్రమణకు గురైనదని సర్వే చేయించాలని కోరగా మండల సర్వేలు వచ్చి సర్వే చేసి సరిహద్దు భూముల్లో 19 సెంట్లు ఎక్కువగా ఉన్నదని తెలిపి ఉన్నారు, అనంతరం సర్వే రాళ్లు పాతినారు సర్వే రిపోర్టు ఇవ్వడం లేదు సర్వే రిపోర్ట్ ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అర్జీలు స్వీకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.వి ప్రవీణ్ ఆదిత్య, డిఆర్ఓ జె.ఉదయ భాస్కరరావు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి కె.సి.హెచ్ అప్పారావు, అప్పిలేట్ ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in