Eluru July 25:రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ శనివారం స్థానిక శనివారపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు.
వసతి గృహంలో బాలలకు అందిస్తున్న సౌకర్యాలు పైన, పరిసరాల శుభ్రత, పిల్లల భద్రత, వైద్య సదుపాయాల పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి తగు సూచనలు చేశారు. బాలురు తమకు విద్యాబోధనకు సరైన ఉపాధ్యాయల సౌకర్యం లేదని ఫిర్యాదు చేయగా, సంబంధిత అధికారులను ప్రశ్నించగా ఉపాధ్యాయుల సౌకర్యాల్ని కల్పించవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారికి అలాగే ఇతర ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. దీనిపైన సంబంధిత అధికారులకు సంప్రదించి తక్షణం ఉపాధ్యాయుల సౌకర్యాన్ని విద్యార్థులకు కల్పించి విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలని సూచించారు మరియు కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీమతి పి. శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in