Bhimavaram:శుక్రవారం స్థానిక మెంటే వారి తోట 2వ వార్డులో అధిక వర్షాలకు ముంపుకు గురైన బాధితులకు శ్రీ విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సహకారంతో రగ్గులు, పుస్తకాలు, గ్లాస్ లను జిల్లా కలెక్టరు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి జీవనం కష్టంగా ఉన్న తరుణంలో, వరద కారణంగా కష్టకాలంలో వున్న బాధితులను ఆదుకున్నప్పుడే మానవత్వం అందరికీ ఆదర్శవంతం అవుతుందన్నారు.10 ఏళ్లుగా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినంద నీయమని, భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు.
శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ మరియు కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 250 మంది ముంపు బాధితులకు వివేకానంద సేవా సమితి సౌజన్యంతో రగ్గులు, 66 మంది చిన్నారులకు గ్లాస్ లు, పుస్తకాలు బిస్కెట్స్ పంపిణీ చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.శ్రీనివాసులు రాజు, సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు వేగిరాజు శివవర్మ, నారాయణరాజు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనరు చెరుకవాడ రంగసాయి, సభ్యులు కంతేటీ వెంకట రాజు, నందమూరి రాజేష్, వబిలిశెట్టి రామకృష్ణ, విఆర్వో అడపా శ్యామ్, ఆర్టీసీ మాజీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, ఎఎంసి మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు ఎద్దు ఏసు పాదం, మెంటే గోపి, స్థానిక నాయకులు మెంటే మనోజ్, తోట సురేష్, బాతు నరేష్, వినుకొండ రాంబాబు, నక్క బెనర్జీ బాబు, తదితరులు పాల్గొన్నారు.
మిరామియా కోడు ముంపుకు గురి అయిన ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి
శుక్రవారం పట్టణంలోని మెంటే వారి తోట రెండో వార్డులో మిరామియా కోడు ముంపుకు గురవుతున్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. మిరామియా కోడు ఏటా కురిసే భారీ వర్షాలు, వరదలు కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయంఆయ్యి ముంపుకు గురిఅవుతున్నాయని, చిన్నపిల్లలు డ్రైయిన్ లో పడి ప్రమాదాలకు గురవుతున్నారని, దీని బారి నుండి కాపాడాలని కలెక్టర్ వద్ద స్థానికులు విన్నవించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్రైయిన్ పై రక్షణ గోడ నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in