Bhimavaram:గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంక్షేమ వసతి గృహాల అత్యవసర మరమత్తులపై ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై సమీక్షించారు.

సంక్షేమ వసతి గృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు చదువుతోపాటు, మెరుగైన వసతి కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 46 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు నిర్వహిస్తుండగా, వీటిలో 35 వసతి గృహాలు ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిలో ఎస్సీ 25, బిసి 09, ఎస్టి 01 వసతి గృహాల్లో ఉన్నాయని, వీటిలో మరమ్మత్తులను చేపట్టుటకు సుమారు రూ.2.65 కోట్ల అంచనాలతో గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదన తయారు చేసే సమర్పించడం జరిగిందన్నారు. ఎస్సీ వెల్ఫేర్ కు సంబంధించి తాడేపల్లిగూడెం పరిమళ, తణుకు బాలికలు, పాలకొల్లు ఆనంద నిలయం, పెంటపాడు బాయ్స్ అండ్ గర్ల్స్ వసతి గృహాలలు, బీసీ వెల్ఫేర్ కు సంబంధించి కాళీపట్నం, పాతపాడు వసతి గృహాలు, ఎస్టి వెల్ఫేర్ కు సంబంధించి భీమవరం వసతిగృహం మరమ్మత్తులను అత్యవసరంగా చేపట్టాల్సిఉందని సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ స్పందిస్తూ అత్యవసర మరమ్మత్తులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలన్నారు. వసతి గృహాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఏదైనా చిన్న మరమ్మత్తు వచ్చినప్పుడే హెచ్ డ.బ్ల్యు.ఓలు శ్రద్ధ కనపరచి రిపేర్ కు చర్యలు తీసుకుంటే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని సూచించారు. వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు హెచ్.డబ్ల్యూ.ఓలు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, జిల్లా గృహనిర్మాణ శాఖ ఈ ఈ జి.పిచ్చయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి వి ఆర్ కె ఎస్ ఎస్ గణపతి రావు, సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ ఎస్.సత్యనారాయణ, సోషల్ వెల్ఫేర్ హెచ్ డబ్ల్యు ఓ భానుమణి, ట్రైబల్ వెల్ఫేర్ హెచ్.డబ్ల్యూ.ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in