Musunuru August 1 : రాష్ట్రంలో 65 లక్షల మంది కి ప్రతీ నెల 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
ముసునూరు మండలం గోపవరం గురువారం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పెన్షన్ మొత్తాన్ని 2 వేల నుండి 3 వేల రూపాయలకు పెంచడానికి గత ప్రభుత్వానికి 5 సంవత్సరాల సమయం పడితే తాము 10 రోజుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచామన్నారు. ప్రతీ నెల మొదటి తేదీనే మొత్తం పెన్షనర్ల అందరికి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందించడం జరుగుతుందని, ఆ సమయంలో ఇంట్లో లేని వారికి 2వ తేదీన పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ కూటమి సభ్యులతో చారిత్రాత్మక విజయాన్ని అందించారని, ఆ విజయాన్ని బాధ్యతగా భావించి ప్రజల ఆకాంక్షల మేరకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు.
ముసునూరు మండలంలో భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ లతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తానని ముసునూరు మండలంలో భూ సమస్యలు చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. వీటి కోసం జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ లతో ప్రత్యేక వేదిక ఏర్పాటుచేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ముసునూరు మండలంలో డ్రైనేజ్, రోడ్ల సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తానని మంత్రి చెప్పారు.
మంత్రి వెంట తహసీల్దార్ ఎమిలీ కుమారి, డివిజినల్ పంచాయతీ అధికారి సుందరి, ఎంపిడిఓ పద్మావతి, ఈఓ పి ఆర్డీ ఎస్.వి.శ్రీనివాసరావు, అర్ డబ్ల్యూఎస్ ఏ ఈ సత్యప్రసాద్, జెడ్పిటిసి ప్రతాప్, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in