Nuzvid August 1: 18 కోట్లతో నూజివీడు మామిడి మార్కెట్‌కి మౌళిక సదుపాయాలు, రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారధి.
ఆగస్టు,1 బుధవారం మధ్యాహ్నం మార్కెట్ యార్డులో ట్రేడర్స్ మరియు మార్కెటింక్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి ఈ సమావేశంలో మార్కెటింగ్ డిప్యూటీ ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ మల్లేశ్వరరావుతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ మరియు అంచనా విలువ యార్డు యొక్క డ్రాయింగ్ మ్యాప్ పరిశీలించిన మంత్రివర్యులు మంత్రివర్యులు మాట్లాడుతూ వచ్చే మామిడి సీజనకి పూర్తి మౌలిక సదుపాయాలతో కూడిన కూడిన మామిడి మార్కెట్ యార్డ్ ను అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ కు అనుసంధానం చేస్తూ పూర్తి సదుపాయాలతో కూడిన యార్డును పూర్తి చేస్తామని తెలిపారు దేనియొక్క అంచనా విలువ సుమారు 18 కోట్లు ఉంటుందని తెలిపారు సుమారు 41 వేల మీటర్ల సువిశాలమైన మార్కెటింగ్ యార్డులో 2 షెడ్స్ మరియు మామిడి రైతులకు సదుపాయాల కోసం 70 షాప్స్ లారీ కాట,సి, సి, రోడ్లు, షెడ్స్, సకల సదుపాయాలతో నూజివీడు మామిడి మార్కెటింగ్ కు కావలసిన మౌలిక సదుపాయలన్ని రానున్న మామిడి సీజనకి పూర్తిచేస్తామని మంత్రివర్యులు తెలియజేసారు తద్వారా నూజివీడు మామిడికి జాతీయ అంతత్జాతీయ స్థాయిలో మంచి ఖ్యాతి తద్వారా రైతులకు ఆర్ధిక ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు ఈ యార్డు ద్వారా నూజివీడు పట్టణ మరియు ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఈ ప్రాంతములో ఎంతో మంది లేబర్ కూడా పనిచేసుకొనే అవకాశం కలుగుతుందని తద్వారా నూజివీడుకు ఆదాయం పెరిగి అభివృద్ధి పధంలో ముందుకెళుతుందని మంత్రివర్యులు తెలిపారు రైతుల యొక్క వాహనాలకు పార్కింగ్‌కు గాను ప్రత్యేక స్థలం కేటాయించి ఇస్తామని హామీ ఇచ్చారు గతంలో నున్న మార్కెట్‌కి తీసుకొని వెళ్లే రైతులు ట్రేడర్స్ వచ్చే సీజన్ నుండి నూజివీడు యార్డుకు మామిడి తరలించి ఇక్కడే కొనుగోలు అమ్మకాలు నిర్వహించి మార్కెట్ అభివృద్ధి కి మరియు నూజివీడు అభివృద్ధి కి సహకరించాలని రైతులకు ట్రేడర్స్ కి చూసించారు వచ్చే సీజన్లో మామిడి మార్కెటింగ్ ఇక్కడి నుండే ప్రారంభిస్తే మరిన్ని గ్రాంట్లు తెచ్చి మరింత అభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చిన మంత్రివర్యులు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సెక్రటరీ యూ, మహాలక్ష్మి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లేశ్వరరావు, ఎ, ఈ, శ్రీనివాస్, ట్రేడర్స్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in