APEPDCL:ఏలూరు ,ఆగస్టు, 12… ఆర్.బి.ఐ మార్గదర్శకాలను అనుసరించి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు మీరు విద్యుత్ బిల్లులు చెల్లించుటకు ఏపీ ఈపీడీసీఎల్ డిస్కం పేరు కనిపించదు. ఇందుమూలంగా విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్ధం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ వారు నూతనంగా విద్యుత్ బిల్లులో క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని కల్పించినట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు సోమవారం ఒక ప్రకటనలు తెలిపారు.ఈ క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను సులభంగా చెల్లించడానికి ఉపయోగపడు తుందన్నారు.
ఎవరి బిల్ పై ఉన్న QR కోడ్ ను వారే వినియోగించగలరు. వాడుకున్న వినియోగదారులు అందరు ఎంతో ఉపయోగకరంగా మరియు సులభంగా ఉందని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సౌకర్యం ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించడం వలన వినియోగదారులకు ఏ విధమైన అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు.
కావున ఈ సౌకర్యాన్ని వినియోగించడం ద్వారా తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోగలరు. మారు మూలప్రాంతాల వారికి కూడా విద్యుత్ బిల్లులను చెల్లించడానికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. అందువలన విద్యుత్ వినియోగదారులందరూ ఈ QR కోడ్ ను వినియోగించి విద్యుత్ బిల్లులను చెల్లించవలసినదిగా ఆయన కోరారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in