anna canteenanna canteen
0 0
Read Time:5 Minute, 27 Second

Five Rupees Food:ఏలూరు, ఆగష్టు, 16 : అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు 5 రూపాయలకే నాణ్యమైన ఆరోగ్యకరమైన భోజనం ప్రభుత్వం అందిస్తున్నదని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.

స్థానిక రామచంద్రరావుపేట లో 9 లక్షల రూపాయలతో పునర్నిర్మించిన ‘అన్న క్యాంటిన్ ‘ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో “అన్న క్యాంటీన్ల” ద్వారా నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తున్నామన్నారు. నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేయించడం జరుగుతుందన్నారు. అల్పాహారం 5 రూపాయలకు ఉదయం 7. 30 ని.ల నుండి 10 గంటల వరకు, మధ్యాహ్న భోజనం 5 రూపాయలకు 12 గంటల నుండి 3 గంటల వరకు, రాత్రి భోజనం 5 రూపాయలకు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అందించడం జరుగుతుందన్నారు. ఆహార నాణ్యతలో ఏమైనా లోపాలుంటే తనకు తెలియజయవచ్చునని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 5 అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తున్నామని, ఏలూరులో 4, నూజివీడు ఒకటి ప్రారంబిస్తున్నామన్నారు.
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ పేదవారికి పట్టెడన్నం పెట్టే ఆశయంతో పేదల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం పయనిస్తోందన్నారు. దేశానికే అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో పాడిపంటలకు నిలయమైన ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలు పచ్చని సిరుల సీమలుగా ప్రసిద్దిగాంచాయి.. అటువంటి రాష్ట్రంలో పేదల ఆకలి బాధలను తీర్చే లక్ష్యంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గతంలో అన్నా క్యాంటిన్లను ప్రారంభించిందన్నారు. 2019 – 24 మధ్య గత ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేయగా, 2024 ఎన్నికల్లో కూటమి అగ్రనాయకత్వం అన్నక్యాంటిన్లను మేనిఫేస్టోలో పెట్టడం, అధికారంలోకి వచ్చిన అనంతరం గురువారం ఆగస్ట్‌ 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంటిన్లను ప్రారంభించారన్నారు. ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేస్తే, గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు.. వైసిపి ధ్వంసం చేసిన పేదవారి ఆకలి ఆశల సౌధాలను తిరిగి పునర్నిర్మించే బాధ్యత తీసుకున్న కూటమి ప్రభుత్వం లక్ష్యసాధన దిశగా పయనిస్తోందన్నారు.. ఇందుకు దాతల సహకారం అవసరమన్న విషయాన్ని గుర్తు చేశారు ఎమ్మెల్యే చంటి.. దీనికి తానే తొలిస్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యేగా తన తొలినెల జీతం లక్షా 25వేల రూపాయలను అన్న క్యాంటిన్ల నిర్వహణకు విరాళంగా ఇస్తున్నట్లు కూటమి నేతలు, పేదల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు.
ఏలూరు జనసేన ఇన్‌ఛార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ దాతృత్వం కలిగిన నేతలు దాతలు ముందుకు నడిపించాలని కోరారు.. పేదలెవ్వరూ పస్తులుండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం శుభ పరిణామన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి లు అన్న క్యాంటిన్ లో అల్పాహారంను ప్రజలకు స్వయంగా వడ్డించారు. అనంతరం ప్రజలతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, కార్పొరేషన్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, తహసీల్దార్ శేషగిరి ,మాజీ డిప్యూటి మేయర్ చోడే వెంకటరత్నం, కో – ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, మాగంటి ప్రభాకర్, దాసరి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు..

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *