Eluru District Judge:ఏలూరు,ఆగస్టు15: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కోర్టు ప్రాంగణమునందు గురువారం ఘనంగా నిర్వహించారు.
ముందుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి తదనంతరం త్రివర్ణ ప్రతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన్యాయమూర్తి పురుషోత్తం కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అమలు పరచడంలో న్యాయస్థానాలు మూల స్తంభాలుగా ఉన్నాయని, అటువంటి న్యాయస్థానంలో పనిచేయటం న్యాయమూర్తిగా నాకు, పనిచేస్తున్న సిబ్బందికి మరియు న్యాయవాదుల యొక్క అదృష్టమని దీనిని సక్రమంగా వినియోగించుకుని ఎవరి విధులను వారు నిబద్ధత నిర్వహించాలని, తద్వారా సమాజానికి ఉత్తమమైన సేవలను అందించవచ్చు అని తెలియజేశారు, కేసులు యొక్క వివరాలను డిజిటల్ చేయడం జరిగిందని తద్వారా సేవలను కక్షిదారుల చెంతకు చేరుతున్నాయని దీనిని మరింత అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ , డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు జిల్లా జడ్జి, న్యాయమూర్తులు న్యాయవాదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు .
కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి పి. మంగాకుమారి, ఐదవ అదనపు జిల్లా జడ్జి జి. రాజేశ్వర, ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి ఎం.సునీల్ కుమార్, పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఎస్. ఉమా సునంద, ఇతర న్యాయమూర్తులు హైకోర్టు బార్ అసోసియేషన్ మెంబర్ బి.వి కృష్ణారెడ్డి, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు పి.పి. కోనే సీతారామ్, జి.పి. బీ.జె.రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కృష్ణనాయక్ మరియు ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదుల గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in