goat sheepgoat sheep
0 0
Read Time:5 Minute, 16 Second

Goat Sheep:ఏలూరు,/ఆగిరిపల్లి, ఆగష్టు, 19 : గొర్రెలు, మేకల పెంపకందార్ల ఆర్ధికాభివృద్ధికీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.

అగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లి గొల్లగూడెంలో సోమవారం గొర్రెలు, మేకల పెంపకందార్ల అవగాహన సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గొర్రెలు, మేకలకు వాక్సిన్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 కోట్ల రూపాయల మాంసం ఉత్పత్తులు వ్యాపారం జరుగుతూ, ఎంతో లాభంగా ఉన్న ఈ వృత్తిని మరింత గౌరవం లభించేలా మనలో మార్పు రావాలని మంత్రి సూచించారు. యాదవులలో 10 నుండి 15 శాతం మంది మాత్రమే గొర్రెల కాపరులుగా, కల్లు గీత కార్మికులలో 10 శాతం మాత్రమే ఆ వృత్తులలో ఉంటున్నారని, అటువంటి వారి ఆర్థికాభివృద్ధికి రుణాలిస్తే, దాని ద్వారా వారు అభివృద్ధి చెందుతారన్నారు. ఆ కులాలలో చదువుకున్నవారు సంతోషపడతారన్నారు. ఈసారి గ్రామీణ ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని, సమాచార సాంకేతిక రంగాన్ని అభివృద్ధి పరచిన ఆద్యుడు చంద్రబాబునాయుడని మంత్రి పేర్కొన్నారు.ఇదే సమయంలో గ్రామీణ వాతావరణంలో నివసిస్తున్న రైతులు, ఎస్సీ లు, బి.సి., లపై దృష్టి పెట్టి వారి జీవితాలలో మార్పు తీసూయకురావాలనే ముఖమంత్రిని కోరామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ బలహీన వర్గాలు, దళితులు గ్రామీణాభివృద్దిపైదృష్టి పెడతామని వారు చెప్పడం జరిగిందన్నారు. 2047 విజన్ కార్యాచరణలో బలహీన వర్గాలు, దళితులూ, కులవృత్తుల వారు ఏ విధంగా అభివృద్ధి చెందాలో పొందుపరుస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారని మంత్రి చెప్పారు. గ్రామీణాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు త్రిమూర్తుల నాయకత్వంలో తప్పకుండా బలహీన వర్గాలు, దళితులకు మేలు జరుగుతుందని భరోసాను ఇస్తున్నానని మంత్రి పార్థసారథి చెప్పారు. గొర్రెల కాపరులు బ్యాంకుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలు కోసం ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. గొర్రెల పెంపకం వ్యవసాయ అనుబంధమేనని, వారిని చిన్నచూపు చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. కుల వృత్తులను అభివృద్ధి చేసుకుంటూ ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయాలన్నారు. రానున్న 5 సంవత్సరాలలో నూజివీడు నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలను గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘాలకు రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటానన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పధకంలో గొర్రెలు, మేకల పెంపకానికి షెడ్లు అందించడం జరుగుతుందని, గొర్రెలు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.జి.నెహ్రు బాబు, డిడి ఎన్ . చంద్రశేఖర్, గొర్రెల, మేకల పెంపకందార్ల రాష్ట్ర అధ్యక్షులు దుద్దుకూరి వెంకట కృష్ణ, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు ఏ డి ఎం. వెంకటేశ్వరరావు, బి.లక్ష్మీనారాయణ, ఏం రామారావు, సుచరిత, పలువురు వెటర్నరీ అసిస్టెంట్లు, సంఘ నాయకులూ, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *