Open School:ఏలూరు, ఆగస్టు,19:ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్యా విధానం ద్వారా అందిస్తున్న పదోతరగతి, ఇంటర్మీడియేట్ కోర్సులను కొనసాగించేందుకు అడ్మిషన్స్ ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ఇందుకు సంబంధించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ ప్రత్యేక దూర విద్యావిధానం ద్వారా చదువు మళ్లీ కొనసాగించి బంగారు భవిష్యత్ ను నిర్మించుకోవాలని సూచించారు. ఇంటర్ నెట్, ఎపి ఆన్ లైన్, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రవేశం పొందే అవకాశం ఉందన్నారు. ఓపెన్ స్కూల్లోని పదోతరగతి, ఇంటర్మీడియేట్ కోర్సుల్లో నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. పదోతరగతికి 14 సంవత్సరాల నిండి చదవగలిగిన, వ్రాయగలిగిన పరిజ్ఞానం కలవారు అందరూ అర్హులేనన్నారు. పదోతరగతి ఫెయిల్ అయినవారికి బడి మధ్యలో మానివేసి 14 సంవత్సరాలు నిండినవారికి పదోతరగతి చదువుకువే సువర్ణ అవకాశం కల్పించబడిందిన్నారు. 15 సంవత్సరాలు నిండి పదోతరగతి పూర్తయిన వారందరూ ఇంటర్మిడియేట్ కోర్సు చదువుకునే అవకాశం ఈవిధానం ద్వారా కల్పించబడిందన్నారు. ఇంటర్మిడియేట్ మానివేసిన వారికి, ఫెయిల్ అయిన వారికి ఇంటర్మిడియేట్ చదువుకునే అవకాశం కల్పించబడిందన్నారు. ఇతర వివరాలకు డిఇఓ, డివిఇఓ, ఆర్ఐఓ, డిప్యూటీ ఇఓ, యంఇఓ, లేదా సమీపంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ఉన్నతపాఠశాల హెడ్మాష్టార్ వారిని సంప్రదించవచ్చన్నారు. ఇతర వివరాలకు వెబ్ సైట్ https://apopenschool.ap.gov.in లేదా హెల్ప్ లైన్ 0863-2239151 ను సంప్రదించవచ్చన్నారు.
కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహాం, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యం. ముక్కంటి, కె. భాస్కర్ పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in