aksyatrutiyaaksyatrutiya
0 0
Read Time:5 Minute, 43 Second

Akshaya Tritiya:అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఈ అక్షయ తృతీయ పర్వదినం వైశాఖ శుద్ధ తదియ నాడు వస్తుంది. దీనిని అక్షయ తృతీయ అంటారు.

అక్షయ అంటే నశించలేనిది, శాశ్వతంగా ఉండేది. ఎప్పటికీ నిలిచిపోయేది అని అర్థం.

ఈరోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది.ఈ అక్షయ తృతీయ నాడే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం జరిగింది.

విష్ణుమూర్తి అవతారమైన పరుశురాముడు పుట్టినరోజు కూడా ఈ అక్షయ తృతీయ నాడే.

పరమశివుడు వరముతో కుబేరుడు సంపదలకు అధిపతిగా నియమించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే.

ఈరోజు పేదరికంలో ఉన్న కుచేలుడు, శ్రీకృష్ణుడు అనుగ్రహంతో ధనవంతుడిగా మారారు.

ఈ అక్షయ తృతీయ నాడే సింహాచలంలోని నరసింహస్వామి భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు.

ఈ అక్షయ తృతీయ నాడే గంగాదేవి భూమిపై వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

వ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడి చేత రాయించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ నాడే.

మహాభారతంలో ధర్మరాజు ఈరోజే అక్షయ పాత్ర దక్కించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.

ఈ అక్షయ తృతీయ నాడే అన్నపూర్ణాదేవి జన్మించిన రోజు. పరమశివుడు వాహనం అయినా నందీశ్వరుడు కూడా ఈ రోజే జన్మించారు.

ఈ అక్షయ తృతీయ నాడు ఇన్ని రకాల ప్రాముఖ్యతను కలిగి ఉండడం బట్టే ఇంత విశిష్టతను సంతరించుకుంది.

ఈరోజు పసిడి రాజుల పర్వదినంగా భావిస్తారు.అందుకనే ఈరోజు పసిడి అంటే బంగారం కొంటే ఎప్పటికీ తరిగిపోకుండా పెరుగుతుందని ప్రజల విశ్వాసం.

ఈరోజున సిరి సంపదను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి ని, విష్ణుమూర్తిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరుతుందని ప్రజలు నమ్ముతారు.

ఈ అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్ర లేచి గంగా నదిలో స్నానం చేసి, ఇల్లు శుభ్రపరచుకొని, పూజ మందిరాన్ని అలంకరించుకోవాలి.

ఒక పీట మీద పసుపు బియ్యం నాణేలు తో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు బియ్యం పోసి దాని పైన తమలపాకు పరిచి, పసుపు వినాయకుని ప్రతిష్టించి కోవాలి. వినాయకుని పసుపు అక్షింతలతో పూజించాలి.

తరువాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీదేవి అష్టోత్తర సూత్రాలు చదవడం వల్ల సకల సౌభాగ్యాలు చేకూరుతాయి.

ఈ విధంగా పూజ చేసిన తరువాత మనం పూజలో పెట్టిన బంగారం గాని, వెండి కానీ బ్రాహ్మణులకు గాని, పేదవారికి గాని దానం ఇవ్వాలి.

ఇలా ఇవ్వడం వల్ల మీ దగ్గర ఉన్న ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.

బంగారం కొనలేని వారు శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు ఉప్పు లేదా పచ్చి పసుపును ఒక అరిటాకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజనాలు అందించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

ఈరోజు దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో అలాగే దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం అని చెబుతారు.

బంగారం దానం చెయ్యలేని వారు కుండతో గాని, రాగి చెంబుతో గాని నీళ్లను దానం చేయాలి ఇలా చేయడం మీ కుటుంబంలోని అభివృద్ధి సిద్ధిస్తుంది.

విసినాకర్ర, గంధం మీకు ఏది వీలైతే అది దానం చేయడం చాలా మంచిది. చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళతామని, ఇలా పూజలు వ్రతాలు, దానాలు చేయడం వల్ల నాశనం లేని, తరిగిపోని పుణ్యఫలాలు పొందుతామని బోలా శంకరులు పార్వతీ దేవికి చెప్పినట్లు పురాణాల్లో చెబుతున్నాయి.

అక్షయ తృతీయ పర్వదినాన ఏ శుభకార్యమైనా వారం, వాద్యం, రాహుకాలం ఏమీ చూడకుండా జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

ఇంతటి విశిష్టత కలిగిన ఈ అక్షయ తృతీయ రోజున అందరూ నదీ స్నానం చేసి పూజలు, దానాలు చేసుకోవడం వల్ల సకల సంపదలు, అష్టైశ్వర్యాలు పొందుతారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *