Andhra Avakaya Pachadi:ఆవకాయ కథ చరిత్ర:
మామిడికాయతో చేసే ఊరగాయ దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందింది ఈ మూడు కలిపి తింటే అమృతం కూడా సరిపోదుఅంటే అతిశయోక్తి కాదు.
ఈ ఆవకాయ మొదట ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించినది ఇది అనేక దశాబ్దాలుగా భారతదేశం లో తయారు చేస్తున్నారు.
అంటే ఇది పురాతనమైన సాంప్రదాయమైన వంటకం చాలా విభిన్న, వైవిధ్యాలు దీనిలో ఉన్నాయి.
తమిళనాడులో కూడా ఊరగాయని చేసుకుంటారు కానీ మన తెలుగు రాష్ట్రాల మాదిరి ఎక్కువ మసాలాలు దానిలోని ఉండదు.
తమిళనాడు ఊరగాయ ఒక టేస్ట్, మన తెలుగు రాష్ట్రాల ఊరగాయ ఒక టేస్ట్ గా ఉంటుంది. మన తెలుగు వాళ్లు ఘాటు ఎక్కువగా ఇష్టపడతారు.
ఈ ఆవకాయని ఎవరు ఎప్పుడు ఎలా తినొచ్చు ఎవరు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకటి రెండు టీ స్పూన్ల మొత్తంలో మామిడికాయ తాలూకు ఊరగాయ ముక్కలను అన్ని వయసుల వారు తినొచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా పెరుగన్నల్లో నంజుకోవడానికి ఈ ఊరగాయను తీసుకుంటూ ఉంటారు. దీని వలన పెరుగులో ఉన్న కపాన్ని తగ్గిస్తుంది. లంచ్ లో గాని టిఫిన్స్ లో కూడా ఈ ఊరగాయలు ఉపయోగిస్తూ ఉంటారు. వేడి అన్నంలో కూడా తినొచ్చు కానీ దీనిని ఎప్పుడూ కూడా మితంగానే తినాలి. ఒకవేళ అధిక రక్తపోటు ఉన్న, ఇతరంతర ఏదైనా ఇబ్బందులు ఉన్నా అప్పుడు దీనిని మితంగానే తినాలి. కొంతమంది తిన్న పడదు అలాంటి వారిని మృదు కోస్టా అంటారు.మద్యకోస్టా ఉండేవారికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ. ఊరగాయని మితంగా తినాలి అతిగా మాత్రం తినకూడదు. దీనిని ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి మితంగా తింటే దీనిలో ఉండే పోషకాలు మన శరీరానికి మేలు చేస్తాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in