సరికొత్త ఫీచర్ల తో ఈపీడీసీఎల్ మొబైల్ యాప్…
ఏపీఈపీడీసీఎల్ ఎస్ఇ – పి.సాల్మన్ రాజు…
ఏలూరు, జులై 08: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ‘ఈస్టర్న్ పవర్’ మొబైల్ యాప్ ను సరికొత్త ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని ఏలూరు సర్కిల్ సూపరెంటెండింగ్ ఇంజనీర్ పి.సాల్మన్ రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఈస్టర్న్ పవర్’ (eastern power) మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వినియోగదారుని 16 అంకెల సర్వీసు నెంబర్ నమోదు చేసుకోవడం ద్వారా మొబైల్ యాప్ సేవలను పొందవచ్చన్నారు. ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్ లో ‘బిల్ పే’ ఆప్షన్ ద్వారా ద్వారా విద్యుత్ బిల్లులను ఎటువంటి అదనపు రుసుము లేకుండా అత్యంత సులభతరంగా చెల్లించవచ్చన్నారు. అంతేకాకుండా వినియోగదారుని సర్వీసుకు సంబందించిన విద్యుత్ వినియోగం, బిల్లు వివరాలు, బిల్లు చెల్లింపు, విద్యుత్ సరఫరా పరిస్థితి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ‘మై యుసెజ్’ ఆప్షన్ ద్వారా విద్యుత్ మీటర్ లో ఉన్న రీడింగ్ ప్రకారం కేవలం ప్రస్తుత వినియోగపు యూనిట్ల సంఖ్యను నమోదు చేయడం ద్వారా విద్యుత్ బిల్లును వినియోగదారులే యాప్ ద్వారా లెక్కించు కోవచ్చన్నారు. యాప్ ద్వారా ఆధార్ నంబర్ కు విద్యుత్ సర్వీసు ను అనుసంధానం చేసుకోవడంతోపాటు విద్యుత్ సంబంధిత సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
పేటీఎం, ఫోన్ పే, జీ పే తో సహా ఇతర యూపీఐ యాప్ ల ద్వారా బిల్లులు నేరుగా చెల్లించే విషయమై ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పాత విధానంలోనే నేరుగా పోన్ పే, పేటీఎం, జీ పేల ద్వారా వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు వీలుగా బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎస్ఈ పి.సాల్మన్ రాజు తెలిపారు. సంస్థ వెబ్ సైట్ www.apeasternpower.com నుంచి కూడా బిల్లులు చెల్లించవచ్చన్నారు. ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్ లో గాని లేదా సంస్థ వెబ్సైటులో గాని బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్ పే, జీ పే, పే టిఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ తో పాటు నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్, వాలెట్స్, క్యాష్ కార్డ్స్ కూడా వాడుకోవచ్చని సాల్మన్ రాజు తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in