Asafoetida Benefits:ఇంగువ ఔషధ గుణాలు కలిగిన ఇంగువ చాలా మంది వంటకాల్లో వాడుతూ ఉంటారు.
కానీ జీలకర్ర ఆవాలు ఉపయోగించినంత ఈజీగా ఎక్కువగా ఇంగువ వాడరు. కొంతమందికి దీని వాసన కూడా పడదు.
చిటికెడు ఇంగువను వంటలు ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ఎవరూ కూడా ఇంగువ వాడకుండా ఉండరు.
ఇంగువను ఆహారంలో తీసుకోవడం వల్ల ఎసిడిటీ, అరగకపోవడం, తేనుపులు అటువంటి ప్రాబ్లం రాదు. ఏది తిన్నా జీర్ణం అయిపోతుంది.
“వాత పితాపి జీర్ణం” అని ఇంగువ వేసిన ఆహారాన్ని అంటూ ఉండేవారు పెద్దలు. అంటే అంత త్వరగా డైజెషన్ అయిపోతుంది కనుక.
అంతే కాదు ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది బాడీలో దీనిని తీసుకుంటే అరగకపోవడం అనే సమస్య ఎప్పుడు ఉండదు.
అసలు గ్యాస్ ఫామ్ కాదు. గ్యాస్ ఛాతిలోని ,గొంతులోని పట్టేస్తూ ఉంటుంది అనే వాళ్ళు ఒక గ్లాస్ వేడి నీటిలో చిటికెడు ఇంగువ వేసి త్రాగితే వెంటనే రిలీఫ్ ని ఇస్తుంది.
అలాగే కొంతమంది టేస్ట్ తెలియట్లేదు అని అంటూ ఉంటారు అలాంటివారు టేస్టి బైట్స్ యాక్టివిటీ చేయాలి అంటే పరిష్కారం ఇంగువ.
దంతాలకు ఉండే ఎనామిల్ పోకుండా ఉండాలంటే మీ చిగుళ్ళు డామేజ్ కాకుండా ఇంగువ తీసుకోవడమే పరిష్కారం. మరియు నోటి పూత, గొంతు ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది.
ఆస్తమా ఉన్నవారు, కపం, దగ్గు ఎక్కువగా వస్తున్న వారు ఈ ఇంగువను తీసుకోవడం మంచిది .అంతే కాదు రాత్రులు పాలలో చిటికెడు ఇంగువ తీసుకోవడం వల్ల నిద్ర బాగా వస్తుంది.
లివర్, కిడ్నీ వంటి ఆర్గాన్స్ పనిచేయడంలో కూడా ఈ ఇంగువ సహాయపడుతుంది. అలాగే బీపీ కంట్రోల్ చేస్తుంది.
మీరు టాబ్లెట్ ఎలా వాడతారో అలాగే ఉదయం సాయంత్రం చిటికెడు ఇంగువ తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది.
కీళ్లవాతం ఉన్నవారు చిటికెడు ఇంగువను వేడి నీటిలో కలిపి ట్యాబ్లెట్ల తీసుకుంటే కీళ్లవాతం పోతుంది.
అలాగే ఇంగువను నూరి కొంచెం గోధుమపిండి లో గాని లేదంటే రాగి పిండి లో గాని, రాగి పిండి చాలా బాగా పనిచేస్తుంది లేదా ఆముదం వేడి చేసి కొంచెం ఇంగువను నూరేసీ దాన్ని మీకు ఎక్కడైతే జాయింట్ పెయిన్ నొప్పి లేదా వాపు ఉందో అక్కడ పూస్తే వెంటనే నొప్పిని తగ్గిస్తుంది.
అలాగే ఇంగువ వేడి నీటితో త్రాగితే మీకు ఇంటర్నల్ గా కూడా పనిచేస్తుంది. అలాగే నెలసరి క్రమంలో వచ్చే కడుపునొప్పి వచ్చేవారు పీరియడ్స్ వచ్చే వారం నుంచి ఇంగువని వాడితే నెలసరిలో కడుపునొప్పి రాదు.
కాబట్టి సర్వరోగ నివారిణిగా పనిచేసే ఇంగువ మన ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in