asramasram
0 0
Read Time:10 Minute, 5 Second

AsramHospital:ఏలూరు, ఆంధ్రప్రదేశ్ – 14 జూలై 2024 – అల్లూరి సీతారామ రాజు వైద్య శాస్త్ర అకాడమీ (ASRAM), అల్లూరి సీతారామ రాజు ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క భాగస్వామిగా వైద్య విద్య, వైద్య పరిశోధన మరియు ఆరోగ్య సంరక్షణలో ప్రతిష్టాత్మకతను సాధించి 25వ వార్షికోత్సవం అనగా రజతోత్సవం మరియు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం హర్షణీయం. ఈ సంధర్బంగా సంస్థ అధినేత శ్రీ డా. గోకరాజు గంగరాజు గారి దార్శనిక నేతృత్వంను గౌరవించడం ద్వారా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.

వార్షిక రజతోత్సవ (Silver Jubilee) ప్రారంభము మరియు వ్యవస్థాపక దినోత్సవం రెండూ 14 జూలై 2024న నిర్వహించబడతాయి. ఈ సంధర్బం గతం, వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క గొప్ప సమ్మేళనం. ఈ రోజు, మాజీ మరియు ప్రస్తుత సొసైటీ డైరెక్టర్లు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు మరియు సమాజ సభ్యులతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘణంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భముగా శ్రీ డా. గోకరాజు గంగరాజు గారు విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రజా సేవ మరియు పారిశ్రామిక రంగాలలో చేసిన విస్తృత కృషికి సొసైటీ సభ్యులు, వైద్యరంగ ప్రముఖులు, కళాశాల సిబ్బంది, పూర్వ మరియు ప్రస్తుత విద్యార్థులు సత్కరిస్తారు.

ఉత్సవ ముఖ్యాంశాలు:

వార్షిక రజతోత్సవాలు ఆశ్రమ్ యొక్క వారసత్వాన్ని మరియు భవిష్య కార్యాచరణల దృష్టిలో ఉంచుకుని వివిధ పద్ధతిలలో నిర్వహించబడతాయి.

ప్రధాన అంశాలు:

ప్రారంభోత్సవం: ప్రముఖ వ్యక్తులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఇతర గౌరవనీయులు పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమం.

శాస్త్రీయ సదస్సులు మరియు వర్క్షాప్లు: వైద్య శాస్త్రంలో నూతన ఆవిష్కరణలపై జాతీయ మరియు రాష్ట్ర శాస్త్రీయసదస్సులు, వర్క్షాప్లు మొదలగునవి నిర్వహించబడతాయి.
సమాజ ఆరోగ్య కార్యక్రమాలు:

వైద్య శిబిరాలు: సమీప గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ అవుట్ రీచ్ లో భాగంగా పేదలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు మరియు వైద్యం అందించడం. ఈ సౌకర్యము ఆసుపత్రి నందు కూడా కొనసాగింపబడుతుంది.

100 ఉచిత శస్త్రచికిత్సలు మరియు 100 డెలివరీలు: అవసరం కలిగిన మరియు పేదలకు శస్త్రచికిత్సలు జరపడం, ఆసుపత్రి లో జరిగిన ప్రతి డెలివరీకి బేబీ మరియు మామ్ కిట్ అందించడం.

శస్త్రచికిత్సలలో రాయితీ: తక్కువ ధరలతో అధిక నాణ్యత గల శస్త్రచికిత్స సేవలను అందించడం మరియు రూ. 90,000/- కే కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స అందించడం.

ఉచిత మరియు రాయితీలతో డయాగ్నోస్టిక్ సేవలు: ముఖ్యమైన డయాగ్నోస్టిక్ పరీక్షలు మరియు సేవలకు రాయితీతో, అవసరమయినచొ పూర్తి రాయితీ సౌకర్యము కలిగించబడుతుంది.

సాంస్కృతిక మరియు క్రీడా కార్యక్రమాలు: విద్యార్థులు మరియు సిబ్బందిలో స్నేహభావం పెంపొందించే సాంస్కృతిక మరియు క్రీడా కార్యాచరణలు ఆచరించడం వలన స అభివృద్ధి సాదించగలగటం.

2/4 పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు: పూర్వ విద్యార్థులకు మరల కలిసే అవకాశం కలి

మరియు వారి అనుభవాలను మరియు విజయాలను పంచుకోవడానికి ప్రత్యేక సమ్మేళనాలు ఏర్పాటు చేయడం.

అవార్డులు మరియు గుర్తింపులు: వైద్య మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో విశేష కృషి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులను గౌరవించడం.

ఆశ్రమ్ ప్రస్థానం:

ఆశ్రమ్ వైద్య కళాశాల 1999లో స్థాపించినప్పటి నుండి, వైద్య విద్యలో ప్రతిష్టాత్మకతను సాధించింది. 2000 సంవత్సరంలో MBBS కోర్సు 100 మందితో ప్రారంభించబడింది, ఇది ఇప్పుడు 250కి పెరిగింది. ASRAM 2007లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను (MD/MS) ప్రారంభించడానికి అనుమతిని పొందింది. ప్రస్తుతం ASRAMలో 158 పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు మరియు 2 సూపర్ స్పెషాలిటీ
కోర్సులు (DNB) అందుబాటులో ఉన్నాయి. సంపూర్ణ అభివృద్ధికి కట్టుబడి, కళాశాల అనేక వైద్య నిపుణులను తీర్చిదిద్దింది మరియు వారు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆశ్రమ్ ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక పరిశోధన కార్యక్రమాలు జరుపుతూ వారికీ ఉన్న అంకిత భావం గల అధ్యాపకులు సహకారంతో వైద్య రంగంలో నూతన ప్రమాణాలు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో జాతీయ వైద్య కమిషన్ (NMC) ద్వారా ప్రాంతీయ వైద్య విద్య సాంకేతిక కేంద్రంగా గుర్తించబడిన ఏకైక వైద్య కళాశాల ఆశ్రమ్ మాత్రమే.

ఆశ్రమ్ విస్తరణ : అల్లూరి సీతారామ రాజు ఎడ్యుకేషనల్ సొసైటీ (ASRE సొసైటీ) నందు మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ మరియు పారా మెడికల్ విద్యాసంస్థలు కూడా నాణ్యమైన విద్య అందించడం మరియు సమాజానికి సేవ చేయడం అనే ఒకే ఒక లక్ష్యం తో నడపబడుచున్నాయి.

శ్రీ. డా. గోకరాజు గంగరాజు గారి దార్శనికత: శ్రీ డా. గోకరాజు గంగరాజు గారి దార్శనికత మరియు నేతృత్వం, ఆశ్రమ్ యొక్క అభివృద్ధి మరియు విజయాలకు పునాదిగా నిలిచింది. వారి సేవలు విద్యా రంగం దాటి అనేక రంగాలలో విస్తరించాయి. వారు పార్లమెంట్ సభ్యులుగా మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఉపాధ్యక్షులుగా విశిష్టిత సాధించారు. వారి నేతృత్వంలో లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పారిశ్రామిక రంగంలో ఉన్నత ప్రమాణాలు సాధించింది. వారి సర్వజన సేవ మరియు సానుకూలత ఆశ్రమ్ సమాజానికి ప్రేరణగా నిలిచింది మరియు వారి అంకిత భావం సంరక్షణ ఆశ్రమ్ సంస్థ పై చెరగని ముద్ర వేసింది.

భవిష్యత్తు ప్రణాళిక: ఆశ్రమ్ వార్షిక రజతోత్సవాలుని జూలై 2024 నుండి జూలై 2025 వరకు

జరుపుబడతాయి. మరింత నాణ్యమైన వైద్య విద్య అందించడం, పరిపూర్ణ ఆరోగ్య సంరక్షణ మరియు సమాజానికి సేవ చేయడం పట్ల ఆశ్రమ్ పునరంకితమవుతుంది. ఆశ్రమ్ వార్షిక రజతోత్సవాలు గత విజయాలను మాత్రమే కాకుండా, భవిష్యత్తు ఆవిష్కరణలకు మరియు సమాజ సేవకు మరింత మార్గం చూపుతాయి.

సిల్వర్ జూబ్లీ ఉత్సవాల గురించి మరింత సమాచారం మరియు నవీకరణలు కోసం దయచేసి www.asram.in ని సందర్శించండి.

అల్లూరి సీతారామ రాజు వైద్య శాస్త్ర అకాడమీ: 1999 లో స్థాపించబడిన అల్లూరి సీతారామ రాజు అకాడెమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ASRAM) ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ వైద్య సంస్థ. ఆశ్రమ్ అధునాతన వైద్య పరిశోధన మరియు నాణ్యత తో కూడిన వైద్య విద్యని అందిస్తుంది. ఆశ్రమ్ 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో అత్యాధునిక సేవలను అందించడంతో పాటు అత్యంత ప్రామాణికమయిన వైద్య విద్యను అందించడానికి కట్టుబడి ఉంది. సంపూర్ణ ఆరోగ్య అభివృద్ధి మరియు సమాజ సేవపై దృష్టితో ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య విద్యను ముందుకు తీసుకెళ్తంది.

మీడియా కొరకు సంప్రదించాల్సిన వారు:

మిస్టర్. హనుమంత రావు గారు, సీఈఓ

అల్లూరి సీతారామ రాజు అకాడెమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ASRAM)

ఫోన్ – కార్యాలయం: +91-9491044800

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *