August 02:రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ శుక్రవారం స్థానిక జిల్లా కారాగారంను సందర్శించారు. కారాగారంలోని ఖైదీలకు అందిస్తున్న ఆహారం, నీరు మరియు వైద్య సౌకర్యాల పైన వివరాలను అడిగి తెలుసుకున్నారు, ఖైదీలతో మాట్లాడుతూ ఖైదీల యొక్క కుటుంబ సభ్యులకు సమస్యలు ఎదురైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని వారికి ఉచిత న్యాయ సహాయం చేస్తారని, అలాగే వివిధ కేసులలో ఉన్న ముద్దాయిలకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ద్వారా ఉచితముగా కేసులను వాదించడం జరుగుతుందని, అలాగే సెప్టెంబర్ 14వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని రాజీయోగ్యమైన కేసులలో ఫిర్యాదుదారులతో సంప్రదించి కేసుల పరిష్కారానికి ప్రయత్నించవలసినదని సూచించారు
ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ఆర్.వి. స్వామి తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in