August 15 2024:ఏలూరు, ఆగష్టు, 15 : ఆజాధీకా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కాన్వాస్ పై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధ సారధి సంతకం చేశారు. స్ధానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నరాష్ట్ర మంత్రి కొలుసు పార్ధ సారధి అక్కడ ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా కాన్వాస్ పై సంతకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సమైఖ్యతను, సమగ్రతను కాపాడటం మన అందరి భాద్యత అన్నారు. ప్రతి భారతీయునిలో దేశ భక్తి పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా విధిగా నిర్వహించుకోవల్సిన అవసరం ఉందన్నారు. దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలన్నారు.
ఎపిఇపిడిసిఎల్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చిన మొబైల్ యాప్ ను వినియోగదారులు వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి చెప్పారు. స్ధానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సంబంధిత యాప్ పై అవగాహన కలిగించే సెల్ఫీ పాయింట్ లో ఆయన సెల్ఫీ తీసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈస్ట్రన్ పవర్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని వినియోగదారుని 16 అంకెల సర్వీసు నెంబరు నమోదు చేసుకోవడం ద్వారా మొబైల్ యాప్ సేవలను పొందవచ్చన్నారు. ఇందులోని బిల్ పే ఆప్షన్ ద్వారా విద్యుత్ బిల్లులను ఎటువంటి అధనపు రుసుము లేకుండా అత్యంత సులభతరంగా చెల్లించవచ్చన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,జిల్లా జడ్జి పురుషోత్తమ కుమార్,జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఎపిఇపిడిసిఎల్ ఎస్ ఇ పి. సాల్మన్ రాజు,డి ఎస్ డి వో శ్రీనివాసరావు,సెట్ వెల్ సిఇఓ మధుభూషణరావు తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in