Ayodhya Surya Tilak:అయోధ్యలో బాల రాముని అద్భుతం
అయోధ్య రామ మందిరం నిర్మాణంలో అడుగడుగునా అద్భుతాలు అందులో ఒకటి సూర్య తిలకం.
అర్చకులు నిత్యం అయోధ్య బాల రామునికి తిలకం దుద్దుతారు. అదే సూర్యుడే దిగి వచ్చి తిలకం దిద్దితే అదే రేపు జరగబోతుంది.
శ్రీ రామ నవమి సందర్భంగా ఈ అపూర్వ ఘట్టం ఆవిష్కరింపబడుతుంది. శ్రీరాముడు జన్మస్థలం అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత శ్రీరామనవమి వేడుకలు కనుల పండగ జరగబోతున్నాయి.
రేపు శ్రీరామనవమి సందర్భంగా ఈ అరుదైన దృశ్యం భక్తులకు కనువిందు చేయబడుతుంది. శ్రీరామునికి సూర్యతిలకం పడేటట్లు ఏర్పాటు చేశారు.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రక్రియ మొదలు కాబోతుంది. సుమారు నాలుగు నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహ నుదుట మీద సూర్యకిరణాలు పడనున్నాయి.
శ్రీరామనవమి రోజు మాత్రమే ఈ అద్భుతం జరగనుంది. రేపు నవమి నేపథ్యంలో బాలరామయ్యకు సూర్యాభిషేకం రిహార్సల్స్ నిర్వహించారు .అది విజయవంతంగా జరగడంతో అర్చకులు ఆనందం వ్యక్తపరిచారు.
సాధారణ రోజుల్లో బాల రామునికి సూర్యాభిషేకం ఉండదు. సూర్యకిరణాలు శ్రీరాముని నుదుటున తాకవు. అయితే శ్రీ రామ నవమి నాడు బాల రాముని దర్శించుకోవడమే కాకుండా ఆయనను స్మూసించి భాగ్యం కూడా సూర్య భగవానునికి దక్కుతుంది.
ఇంకా రేపు శ్రీరామనవమి వేడుకకు అయోధ్యలో రామ మందిరం ముస్తాబు అవుతుంది. ఈ వేడుక ను చూసేందుకు అయోధ్యకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు అని అధికారులు అంచనా వేస్తున్నారు.
500 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరాముడు జయంతి ఉత్సవాలకు ఘనంగా నిర్వహించేందుకు అయోధ్యతో పాటు ఎనిమిది వందల మఠాలు, అనేక దేవాలయాలు కూడా శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటాయి.
అయోధ్య రాముని విగ్రహానికి కొన్నివేల క్వాంటాల పూలతో అలంకరించే నున్నారు. అయోధ్య నగరవ్యాప్తంగా 500 పైగా L. E. D స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in