babycorn snacksbabycorn snacks
0 0
Read Time:5 Minute, 18 Second

Babycorn snacks:బేబీ కార్న్ స్నాక్స్ మంచూరియా కు కావలసిన పదార్థాలు బేబీ కార్న్ 12, మైదా మూడు టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ఒకటి, ఉల్లికాడలు తరుగు

1 టేబుల్ స్పూన్లు, అల్లం ,వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్ల, కారంఒక టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, చిల్లి సాస్ ఒక టీ స్పూన్, సోయాసాస్, టమాటా సాస్ రెండు టీ స్పూన్ల చొప్పున, నూనె వేయించడానికి సరిపడా, వెల్లుల్లి తరుగు
తయారీ విధానం
ఒక గిన్నెలో బేబీ కార్న్, ఉప్పు, కారం అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ ఫ్లోర్, వేసి సరిపడా నీళ్లు వేసి బాగా కలపాలి. తరువాత బేబీ కార్న్ నూనెలో పకోడీలు మాదిర వేసి దోరగా వేయించాలి. ఆ తరువాత ఒక ఫ్రైయింగ్ పాన్ లో అర టేబుల్ స్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగులను వేయించాలి. తరువాత చిల్లి సోయాసాస్ టమాటా సాస్ కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత బేబీ కార్న్, ఉల్లికాడల తరుగు కూడా వేసి బాగా కలిపి దించేయాలి.
లాలీపాప్స్
కావలసిన పదార్థాలు
పన్నీర్ 200 గ్రాములు, క్యాప్సికం ఒకటి, బేబీ కార్న్ 10, గరం మసాలా, తేనె అర టీ స్పూన్ల చొప్పున, నిమ్మరసం ఒక టీ స్పూన్, రెండు టేబుల్ స్పూన్లు చాట్ మసాలా, కారం పావు టీ స్పూన్ల చొప్పున, ఉప్పు రుచికి సరిపడా, టూత్ పిక్స్
తయారీ విధానం
బేబీ కార్న్ అడ్డంగా సగానికి కోయాలి. తరువాత పన్నీర్, క్యాప్సికాలను కూడా అంగుళం మేర ముక్కలుగా కోయాలి. ఆ తర్వాత ముక్కలు అన్నిటిని ఒక గిన్నెలో వేసి ఉప్పు, కారం,నిమ్మరసం, గరం మసాలా, తేనె వేసి బాగా కలిపి అరగంట నానబెట్టాలి. తరువాత టూత్ పిక్లను క్యాప్సికం, పన్నీర్ ముక్కలను, గుచ్చి, చివరలో బేబీ కార్న్ నిలువుగా గుచ్చాలి. ఆ తరువాత వీటిని ఒక పెనం మీద ఉంచి కొద్ది కొద్దిగా నూనె వేస్తూ దోరగా అన్ని వైపులా వేయించాలి. చివర్లో చాట్ మసాలా జల్లి దించేయాలి.

స్పైసీ బేబీ కార్న్ కావలసిన పదార్థాలు
బేబీ కార్న్ 10, పెరుగు పావు కప్పు, కార్న్ ఫ్లోర్ నూనె ఒక టేబుల్ స్పూన్ల చొప్పున ,పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్, కారం, చాట్ మసాలా, గరం మసాలా, అరా టీ స్పూన్ చొప్పున, ఉప్పు రుచికి సరిపడా ,నిమ్మరసం ఒక టీ స్పూన్.
తయారీ విధానం
బేబీ కార్న్ ను కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి తీయాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, పెరుగు పసుపు, కారం, ఉప్పు,నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బేబీ కార్న్ ను వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. తరువాత పెనం మీద నూనె వేసి బేబీ కార్న్ ను అన్ని వైపుల ద్వారా వేయించాలి.
గోల్డ్ ఫింగర్స్
కావలసిన పదార్థాలు
బేబీ కార్న్ 10, సెనగపిండి, బియ్యం పిండి, పావు కప్పు చొప్పున, కారం అర టీ స్పూను, వంటసోడా చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, నూనె వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక్కో బేబీ కార్న్ ను నిలువుగా సగానికి కోసి రెండు ముక్కల చేయాలి. తరువాత ఒక గిన్నెలో సెనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, వంటసోడా వేసి సరిపడా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తరువాత కడాయిలో నూనె పోసి అది వేడెక్కాక బేబీ కార్న్ ముక్కల్ని బజ్జీల పిండిలో ముంచి పిండి బాగా పట్టాక నూనెలో వేసి బంగారపు రంగు వచ్చేవరకు వేయించాలి.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *