Banana:అరటిలో అందం మొటిమలు కారణంగా నల్ల మచ్చలు, విటమిన్లు, పోషకాలు నిండిన అరటితో వీటికి మంత్రం వేయండి. చర్మానికి పోషణ అందడంతో పాటు సమస్య దూరం అవుతుంది. పండిన అరటి పండు తొక్కతో సహా మెత్తగా చేయాలి. గుజ్జు వేపాకులను కలిపి మిక్సీ పట్టాలి.
ఈ మిశ్రమానికి కొంచెం పసుపు కలపాలి. ఈ పేస్టును ముఖానికి రాసి ఆరేక ,గోరువెచ్చ నీటిలో కడిగేయాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ సమృద్ధిగా గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల పింపుల్స్ ను నివారిస్తుంది. మచ్చలు పోయి నిగారించేలా చేస్తుంది.
అరటిపండును గుజ్జుగా చేసి, అందులో రెండు స్పూన్ల పెరుగు వేయాలి. ఈ పేస్టు ముఖానికి రాసి 20 నిమిషాలు అయ్యాక నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖ మృదువుగా నల్లమచ్చలు లేకుండా యవ్వనంగా కనిపిస్తుంది.
ఇందులోని లాక్టిక్ యాసిడ్ ఎటువంటి చర్మ సమస్యలైనా దూరం చేస్తుంది. అరటి గుజ్జులో స్పూన్, నిమ్మరసం చెంచా, తేనె కలపాలి. ఈ ప్యాక్ ను ముఖానికి రాసి పావుగంట అయ్యాక గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. దీనిలోని సిట్రిక్ యాసిడ్ ముఖంపై జిడ్డును తొలగించి తాజాగా ఉండేలా మారిస్తుంది.
ఏ, బి, సి, విటమిన్లు , ఐరన్, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి నల్ల మచ్చలను తొలగిస్తాయి. పింపుల్స్ బెడద ఉండదు. అరటిలోని విటమిన్ సి మచ్చలను దూరం చేస్తుంది.
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు పింపుల్స్ కి కారణం అయ్యే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. న్యూట్రియంట్లు చర్మాన్ని బిగుతుగా చేయడమే కాదు. గీతలు ముడతలు వంటివి రాకుండా చేస్తాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in