BhimavaramBhimavaram
0 0
Read Time:18 Minute, 5 Second

Bhimavaram:భీమవరం: జూన్ 2,2024 ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధంగా ఉన్నట్టు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు .

ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ జిల్లా మీడియా సెంటర్ నందు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత వేజెండ్ల సంయుక్తంగా పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ఓట్లు లెక్కింపు ఏర్పాట్లను వెల్లడించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లును పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాకు సంబంధించి భీమవరంలో రెండు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ ఆర్ కె ఆర్ కళాశాలలోను, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించి విష్ణు కాలేజీలోనూ ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

జిల్లా జనాభా వివరాలు

జిల్లాలో 2023 సంవత్సరం నాటికి అంచనా మొత్తం జనాభా 19,00,228 మంది కాగా వీరిలో పురుషులు 9,48,461 మంది, స్త్రీలు 9,51,766 మంది ఉన్నారన్నారు. నియోజకవర్గాల వారీగా ఆచంట పురుషులు 1,22,526 మంది, స్త్రీలు 1,21,397 మంది మొత్తం 2,43,924 మంది, పాలకొల్లు పురుషులు 1,29,318 మంది, స్త్రీలు 1,28,505 మంది మొత్తం 2,57,823 మంది, నర్సాపురం పురుషులు 1,12,648 మంది, స్త్రీలు 1,12,612 మంది మొత్తం 2,25,261 మంది, భీమవరం పురుషులు 1,62,325 మంది, స్త్రీలు 1,64,025 మంది మొత్తం 3,26,350 మంది, ఉండి పురుషులు 1,41,958 మంది, స్త్రీలు 1,42,894 మంది మొత్తం 2,84,852 మంది, తణుకు పురుషులు 1,46,918 మంది, స్త్రీలు 1,48,356 మంది మొత్తం 2,95,274 మంది, తాడేపల్లిగూడెం పురుషులు 1,32,768 మంది, స్త్రీలు 1,33,977 మంది మొత్తం 2,66,745 మంది ఉన్నారన్నారు.

జిల్లాలో ఓటర్లు, ఓటు వినియోగించుకున్న వారు, పోలింగ్ శాతం వివరాలు

జిల్లాలో మొత్తం 14,72,923 మంది ఓటర్లు ఉండగా పురుషులు 7,21,532 మంది, స్త్రీలు 7,51,313 మంది ఇతరులు 78 మంది ఉన్నారన్నారు. వీరిలో ఓటును వినియోగించుకొన్న వారు మొత్తం 12,16,558 మంది ఉండగా, వారిలో పురుషులు 6,02,480 మంది, స్త్రీలు 6,14,031 మంది, ఇతరులు 47 మంది ఉన్నారని 82.59 పోలింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు .

నియోజకవర్గాల వారీగా ఆచంట పురుషులు 88,881 మంది, స్త్రీలు 91,132 మంది, ఇతరులు నలుగురు, మొత్తం 1,80,017 మంది ఉండగా, ఓటు వినియోగించుకున్న వారు మొత్తం 1,49,048 మంది, వీరిలో పురుషులు 73,024 మంది, స్త్రీలు 76,022 మంది, ఇతరులు ఇద్దరు, పోలింగ్ శాతం 82.80 ,

పాలకొల్లు పురుషులు 95,742 మంది, స్త్రీలు 99,309 మంది, ఇతరులు ఆరుగురు మొత్తం 1,95,057 మంది ఉన్నారన్నారు. వీరిలో ఓటు వినియోగించుకున్న వారు మొత్తం 1,60,489 మంది, వీరిలో పురుషులు 79,802 మంది, స్త్రీలు 80,684 మంది, ఇతరులు ముగ్గురు, పోలింగ్ శాతం 82.28 ,

నర్సాపురం పురుషులు 84,667 మంది, స్త్రీలు 85,781మంది, ఇతరులు లేరు మొత్తం 1,70,448 మంది ఉన్నారన్నారు. వీరిలో ఓటు వినియోగించుకున్న వారు మొత్తం 1,43,825 మంది, వీరిలో పురుషులు 72,598 మంది, స్త్రీలు 71,227 మంది, ఇతరులు లేరు, పోలింగ్ శాతం 84.38

భీమవరం పురుషులు 1,22,790 మంది, స్త్రీలు 1,30,275 మంది, ఇతరులు 51 మంది మొత్తం 2,53,116 మంది ఉన్నారన్నారు. వీరిలో ఓటు వినియోగించుకున్న వారు మొత్తం 2,00,857 మంది, వీరిలో పురుషులు 99,174 మంది, స్త్రీలు 1,01,656 మంది, ఇతరులు 27, పోలింగ్ శాతం 79.35

ఉండి పురుషులు 1,10,146 మంది, స్త్రీలు 1,14,577 మంది, ఇతరులు ఇద్దరు మొత్తం 2,24,725 మంది ఉన్నారన్నారు. వీరిలో ఓటు వినియోగించుకున్న వారు మొత్తం 1,93,722 మంది, వీరిలో పురుషులు 96,695 మంది, స్త్రీలు 97,025 మంది, ఇతరులు ఇద్దరు, పోలింగ్ శాతం 86.20

తణుకు పురుషులు 1,14,435 మంది, స్త్రీలు 1,20,135 మంది, ఇతరులు ఐదుగురు మొత్తం 2,34,575 మంది ఉన్నారన్నారు. వీరిలో ఓటు వినియోగించుకున్న వారు మొత్తం 1,92,627 మంది, వీరిలో పురుషులు 93,979 మంది, స్త్రీలు 98,644 మంది, ఇతరులు నలుగురు, పోలింగ్ శాతం 82.12

తాడేపల్లిగూడెం పురుషులు 1,04,871 మంది, స్త్రీలు 1,10,104 మంది, ఇతరులు 10 మంది మొత్తం 2,14,985 మంది ఉన్నారన్నారు. వీరిలో ఓటు వినియోగించుకున్న వారు మొత్తం 1,75,990 మంది, వీరిలో పురుషులు 87,208 మంది, స్త్రీలు 88,773 మంది, ఇతరులు 9 మంది, పోలింగ్ శాతం 81.86

హోమ్ ఓటింగ్ (85+) వివరాలు

మొత్తం 1,072 మంది 85+ వయసు కలిగిన వారు హోమ్ ఓటింగ్ వినియోగించుకోగా, వీరిలో 09- పార్లమెంటరీ నియోజకవర్గంలో 536, ఆచంట 39, పాలకొల్లు 165, నరసాపురం 60, భీమవరం 57, ఉండి 65, తణుకు 81, తాడేపల్లిగూడెం 69 మంది హోమ్ ఓటింగ్ ఉపయోగించుకున్నట్లు తెలిపారు.

పిడబ్ల్యుడి ఓటింగ్ వివరాలు

మొత్తం 1,022 మంది వికలాంగులు హోం ఓటింగ్ వినియోగించుకోగా, వీరిలో 09 నరసాపురం నియోజకవర్గంలో 553, నియోజకవర్గాల వారీగా ఆచంట 48, పాలకొల్లు 154, నరసాపురం 46, భీమవరం 50, ఉండి 81, తణుకు 93, తాడేపల్లిగూడెం 81 మంది హోమ్ ఓటింగ్ ను వినియోగించుకున్నట్లు తెలిపారు.

ఎన్నికల్లో విధులు, అనుబంధ విధులు లలో పాల్గొన్న ఉద్యోగులు వినియోగించుకున్న పోస్టల్ బ్యాలెట్ వివరాలు

జిల్లాలో మొత్తం 13,345 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోగా, నియోజకవర్గాల వారీగా ఆచంట 1430, పాలకొల్లు 2,143, నరసాపురం 1,566, భీమవరం 2,598, ఉండి 1,631, తణుకు 2,082, తాడేపల్లిగూడెం 1,895 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్లు తెలిపారు.

ఈ టి పి బి ఎస్ సర్వీస్ ఓటర్ల ఓటింగ్ వివరాలు

మొత్తం 888 మంది సర్వీస్ ఓటర్లు ఈ టి పి బి ఎస్ బ్యాలెట్ ఓటును డౌన్లోడ్ చేసుకోగా, నేటి వరకు 350 మంది ఈటిపిబిఎస్ ను పోస్ట్ ద్వారా అందుకోవడం జరిగింది. కౌంటింగ్ రోజున కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఒక గంట వరకు ఈ టి పి బి ఎస్ ఓట్లను పోస్ట్ ద్వారా అందుకోవచ్చు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

పోస్టల్ బ్యాలెట్ మరియు ఈటిపిబిఎస్ ఓట్ల లెక్కింపు టేబుల్స్ వివరాలు

పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ కు, ఒక టేబుల్ ఈటిపిబిఎస్ ఓట్ల లెక్కింపుకు వినియోగించడం జరుగుతుందన్నారు. పార్లమెంట్ కు సంబంధించి విష్ణు కాలేజీ లైబ్రరీ రీడింగ్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ నందు లెక్కింపు జరుగుతుందన్నారు.

అలాగే ఏడు నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు టేబుల్ ను పోస్టల్ బ్యాలెట్ కు, ఆర్వో టేబుల్ పైన ఈటిపిబిఎస్ ఓట్ల లెక్కింపు ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాల్స్ నందు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈవిఎంస్ కౌంటింగ్

పార్లమెంటరీ కాన్స్టెన్సీ కి 14 టేబుల్స్, అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ చొప్పున ఏడు నియోజకవర్గాల కౌంటింగ్ హాల్స్ నందు లెక్కింపు జరుగుతుందని తెలిపారు.

ఓట్ల లెక్కింపుకు 265 మంది కౌంటింగ్ సూపర్వైజర్స్, 431 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 297 మంది మైక్రో అబ్జర్వర్సు, 52 మంది ఏఆర్ఓస్ విధులను కేటాయించగా, 20 మంది చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ ను, 147 మంది కౌంటింగ్ ఏజెంట్స్ ను వివిధ రాజకీయ పార్టీల తరఫున నియమించడం జరిగిందన్నారు.

పోలింగ్ కు ఈవీయంల వినియోగం

పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలలో 2,926 బియులు, సి యు లు, వివి ప్యాడ్స్ ఒక్కొక్కటి 1,463 చొప్పున, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు బియులు, సి యు లు, వివి ప్యాడ్స్ మొత్తం 1,463 వినియోగించడం జరిగిందన్నారు.

09 నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ అభ్యర్థులతో పాటు, కౌంటింగ్ ఏజెంట్లకు కూడా మే 28న అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కౌంటింగ్ సెంటర్లకు ఒక కిలోమీటర్ల పరిధిలో స్టెరైల్ జోన్ గా పరిగణించడం జరుగుతుందని, అక్కడనుండి కౌంటింగ్ కేంద్రం ముఖద్వారం వరకు కౌంటింగ్ ఏజెంట్లకు, కౌంటింగ్ సిబ్బంది రవాణాకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విష్ణు కాలేజ్ కౌంటింగ్ సెంటర్ ను చేరుకోవడానికి 16 బస్సులు, ఎస్ ఆర్ కె ఆర్ కౌంటింగ్ సెంటర్ ను చేరుకోవడానికి 10 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ హాల్స్ లోపలికి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఇయర్ ఫోన్లు, ఇయర్ మెషీన్లు అనుమతించబడవనీ, అదేవిధంగా, అగ్గిపెట్టెలు, పదునైన వస్తువులు మొదలైనవి ఖచ్చితంగా నిషేధించబడ్డాయని తెలిపారు. మీడియా ప్రతినిధులకు సెల్ ఫోన్లు మీడియా సెంటర్ వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రం లోపల, వెలుపల 100 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీల వ్యక్తుల నుండి బైట్స్ తీసుకోవడానికి అనుమతి లేదన్నారు.

ఎన్నికల పరిశీలకుల వివరాలు:

ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రాలు భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు కౌంటింగ్ పరిశీలకులుగా ఎం.దీపా, ఐఏఎస్ వ్యవహరిస్తారన్నారు.

అలాగే విష్ణు కాలేజీలో ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల కౌంటింగ్ పరిశీలకులుగా డాక్టర్ బన్శిధర్ కుమవాట్ (Dr. Banshidhar Kumawat), అలాగే నరసాపురం, తణుకు నియోజవర్గాలకు కౌంటింగ్ పరిశీలకులుగా ఎల్ నిర్మల్ రాజ్ వ్యవహరిస్తారని తెలిపారు.

కౌంటింగ్ కేంద్రాల్లో సి సి కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని అనుసంధాతనిస్తూ ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ ప్రతిక్షణం పరిశీలించి ఏదైనా తప్పును గుర్తిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే కౌంటింగ్ ఏజెంట్లు మైక్రో అబ్జర్వర్ గాని, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గాని తెలియజేయాలని, అలా కాకుండా గలాటా సృష్టించాలని ప్రయత్నిస్తే కౌంటింగ్ కేంద్రం నుండి బయటికి పంపడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయమై పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకు తెలియపరచాలన్నారు.

జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజిత వేజెండ్ల మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతతకు భంగం కలిగించే ఏ విషయాన్ని అయినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అందరూ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు సరైన కారణం లేకుండా కౌంటింగ్ కేంద్రాల పరిధిలోని హోటల్లు, లాడ్జిలో బస్సు చేయకూడదని, తనిఖీలలో దొరికితే కస్టడీలో తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. మూడంచెల భద్రత కొనసాగుతుందని, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పక్షపాతం లేకుండా లా అండ్ అమలు చేయడం జరుగుతుందని, ఏ విధమైన గలాటాల సృష్టించిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదని, ఎన్నికల నిబంధనలు మేరకు కఠిన చర్యలు ఉంటాయని మరొకసారి హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144 CrPC అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 137 గ్రామాల్లో పికెటింగ్ కొనసాగుతుందని, ఆరు వేల మందిని బైండవ చేయడం జరిగిందన్నారు. ఖచ్చితంగా కౌంటింగ్ రోజు మరియు తరువాతి రోజులలో ఎవరైనా అతిక్రమించడానికి ప్రయత్నిస్తే వారు కఠినమైన శిక్షను ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేశారు. నాన్‌బెయిలబుల్‌గా ఉండే కఠినమైన సెక్షన్‌లతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అన్ని ప్రధాన గ్రామాలు మరియు కుగ్రామాలు ఎలాంటి భావోద్వేగ సంబంధిత హింసకు గురికాకుండా కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. అలజడలకు కారణమైన వారితో పాటు, వారిని ప్రోత్సహించిన వారిపై కూడా నాన్ బేలబుల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి, పాస్పోర్ట్ అవకాశాలు దెబ్బతింటాయని స్పష్టం చేశారు. కావున మీడియా ఈ విషయంపై విస్తృత ప్రచారం కల్పించాలని, దీని పర్యవసానాలను, పర్యవసానాలను ఇబ్బంది పెట్టేవారు అర్థం చేసుకోవాలని కోరారు. బయటకు వచ్చి బీభత్సం సృష్టిస్తే వెంటనే అరెస్టు చేస్తామన్నారు.

లెక్కింపును ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *