Bhimavaram:భీమవరం: జూన్ 02,2024. సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా కేంద్ర, రాష్ట్ర,జిల్లా పోలీసులు సేవలు అభినందనీయం ఇదే స్ఫూర్తితో కౌంటింగు పక్రియ శాంతియుతంగా జరిగేలా విధులు నిర్వహించాలి.
జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్, జిల్లా ఎస్పి అజిత వేజెండ్ల ….
ఆదివారం జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర కేంద్ర, రాష్ట్ర బలగాలతో నిర్వహించిన పెరేడ్ లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ గత రెండు మాసాల నుండి జిల్లాలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు పూర్తి కావడానికి మీ వంతు సహకారం ఎంతో గొప్పదని అభినందించారు. ఇదే స్ఫూర్తితో కౌంటింగ్ కూడా ప్రశాంతంగా పూర్తి కావడానికి నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని కోరారు. పోలీసు అధికారులు, సిబ్బంది సేవలు వలన శాంతి భద్రతలు పరిరక్షణకు దోహదపడ్డాయన్నారు. ఎన్నికల కౌంటింగు అయిన అనంతరం మరో రెండు రోజులపాటు మీకు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. కట్టుదిట్టమైన భద్రత కల్పించి శాంతి భద్రతలను పరిరక్షించాలని జిల్లా కలెక్టరు సమిత్ కుమార్ కోరారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మీకు విధులు కేటాయించిన ప్రాంతాలలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మీకు ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు.
అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి యస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వరకు నిర్వహించిన కవాతులో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్, జిల్లా ఎస్పి అజిత వేజెండ్ల పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, అదనపు ఎస్పీ వి.భీమారావు, పలువురు డీఎస్పీలు, సిఐలు,పోలీసులు, తదితరులు ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in