Bhimavaram:భీమవరం: జూన్ 12,2024 బడిలోనే భవిష్యత్తు ఉంటుందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు.
బుధవారం ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా భీమవరం ప్రకాశం చౌక్ నందు జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. ర్యాలీ ప్రకాశం చౌక్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు బాల కార్మిక వ్యతిరేక నినాదాలతో ప్రజలకు అవగాహన కలిగిస్తూ కొనసాగడమైనది. తొలుత బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ బాలలు బడికి వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని, బాలలు పనికి కాకుండా బడిలో ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలు కచ్చితంగా స్కూల్లో గాని, అంగన్వాడిలో గాని మాత్రమే ఉండాలన్నారు. ఇళ్లల్లో, ఫ్యాక్టరీలు, షాప్స్, హోటల్స్ తదితర ప్రదేశాల్లో పనిచేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే కార్మిక శాఖకు తెలియజేయాలన్నారు. తనిఖీలలో గుర్తించిన బాల కార్మికులను పనిలో పెట్టుకునే యాజమాన్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కార్మిక, రెవెన్యూ, అంగన్వాడి, స్త్రీ శిశు సంక్షేమం, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, పోలీస్, తదితర శాఖల ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటుచేసి మూడు రోజులు పాటు ఒక్కొక్క మండలంలో వున్న ఫ్యాక్టరీలను, ఇటుక బట్టేలను, షాపులను, హోటళ్లను తనిఖీ చేసి బాల కార్మికులను గుర్తిస్తే అవగాహన కల్పించడంతోపాటు, బడిలో చర్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీని కొరకు రానున్న రెండు నెలల కాలానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది అన్నారు. బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలనలో బాగంగా ప్రధానంగా పాఠశాలల్లో విద్యార్ధుల డ్రాప్ అవుట్స్ పై దృష్టి సారించడం జరిగిందన్నారు. పిల్లలు బడికి వెళ్లే పరిస్ధితులు అన్ని ఉన్నాయని ఎట్టి పరిస్ధితుల్లో బడిబయట పిల్లలు ఉండేందుకు ఎంతమాత్రం అవకాశం లేదన్నారు. చిన్నతనంలో సంపాదనకు అలవాటు చేస్తే ఆపిల్లలు పలు దురాలవాట్లకు పాల్పడే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని కె.శోభ రాణి, మున్సిపల్ కమిషనర్ శ్యామల, దిశా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ శ్రీ లక్ష్మి, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ సిహెచ్ రంగ సాయి, భీమవరం మండల న్యాయ సేవాధికార సంస్థ, విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, భీమవరం ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్,, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in