Bhimavaram:భీమవరం: జూన్ 12,2024 ప్రభుత్వ ఆసుపత్రుల నందు ప్రసవాలను ప్రోత్సహించాలని, ఇందుకు వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని పీహెచ్సీల వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నందు డెలివరీలు, మలేరియా, డెంగ్యూ సీజనల్ డిసీజెస్, రక్తహీనత, పి ఎం ఈ వై వై, ఈ జె ఎస్ వై, మందుల నిల్వలు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో నూరు శాతం డెలివరీలు జరగాలని, తక్కువగా డెలివరీలు జరుగుతున్న ఆస్పత్రులను సమీక్షించుకుని తగిన చర్యలు తీసుకోవాలని డి ఎం అండ్ హెచ్ ఓ కు సూచించారు. పేషెంట్లనుండి అభిప్రాయ సేకరణ తీసుకోవాలన్నారు. రక్తహీనతకు సంబంధించి ఐరన్ టాబ్లెట్ లు, ఇంజక్షన్లు పేషంట్లు తీసుకుంటున్నారో లేదో సమాచారాన్ని తీసుకొని సమీక్షించాలన్నారు. ఆర్ సి హెచ్ పోర్టల్ నందు వివరాలను అప్డేట్ చేసి చెక్ చేసుకోవాలన్నారు. పిఎంఎం ఈ వై దరఖాస్తుల వివరాలను అప్డేట్ చేయాలని సూచించారు. ఈ జె ఎస్ వై లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లు ఈకేవైసీ సమస్యను పరిష్కరించాలన్నారు. జిల్లాలో మందుల నిల్వలు సమీక్షించుకుని, అవసరమైన వాటికి ఇండెంట్ పెట్టాలని తెలిపారు. జిల్లాలో ఈ సీజన్ లో చిన్నారులు ఎవరు డెంగ్యూతో చనిపోరాదని, చిన్నారుల జీవితంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి మలేరియ, డెంగ్యూ వ్యాధులను అరికట్టాలన్నారు. ఎవరికైనా డెంగ్యూ వ్యాధి సోకినా తక్షణమే చికిత్స అందించాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా సమాచారాన్ని సేకరించి ఎక్కడైనా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియ, డెంగ్యూ వ్యాధులపై ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. దోమలను అరికట్టాలంటే పారిశుద్ధ్యం చేపట్టవలసిన ప్రాంతాలను గుర్తించి తెలియజేయాలన్నారు. లార్వా స్టేజి నుంచి దోమలను అరికట్టాల్సి ఉంటుందని, ఇందుకు ఫాగింగ్, ఫ్రైడే డ్రైడే యాక్టివిటీలు, ఆయిల్ బాల్స్ వేయడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, తదితర అంశాలపై వివరణాత్మకంగా ప్రణాళికను రూపొందించాలన్నారు. ఐఈసి యాక్టివిటీలను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి.మహేశ్వరరావు, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పి. సూర్యనారాయణ రావు, డిపిఎమ్ఓ డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి, పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in