Bhimavaram:భీమవరం: జూన్ 14,2024 జిల్లాలోని వరదముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలు చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య ఇరిగేషన్, రెవెన్యు అధికారులతో సమావేశమై అధిక వర్షాలు కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలలోన్ని వరద ముంపు గ్రామలలో తగిన రక్షణ చర్యలు చేపట్టేందుకు ముందస్తు ప్రణాలకులను సిద్ధం చేయాలని ఆదేశించారు. పెనుగొండ, మొగల్తూరు, ఆచంట, నరసాపురం, యలమంచిలి మండలాల్లోని కొన్ని గ్రామాలు వరద ముంపుకు గురికావడం జరుగుతుందన్నారు. ఈ వర్షాకాలం సీజన్ లో ఎంత వర్షం కురవవచ్చు, ఎన్ని క్యూసెక్కుల నీరు చేరవచ్చు అనే సమాచారాన్ని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలను క్రోడీకరించి సిద్ధంగా ఉండాలన్నారు. భద్రాచలం నుండి విడుదలయ్యే నీటిని అంచనగా తీసుకుని ముందుగా ఏ మండలాల్లోని ఏయే గ్రామాలలో నీరు చేరవచ్చో ఆయా గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 15 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఎన్ని గ్రామాలు ప్రభావితం అవుతాయి, అలాగే 20 లక్షలు క్యూసెక్కులు నీరు వస్తే ఎన్ని గ్రామాలపై ప్రభావం ఉంటుంది అనేది ఒక అంచనాకు రావాలన్నారు. చిన్నగొల్లపాలెం వద్ద పరిస్థితులను మెరుగుపరచాలన్నారు. చోక్ పాయింట్స్ బ్లాక్ అవకుండా చూసుకోవాలన్నారు. గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఏదైనా గ్రామంలో వరద నీరు చేరితే పునరావాస కేంద్రాల ఏర్పాటు కు ముందస్తుగా గుర్తించాలన్నారు.
ఈ సమావేశంలో నరసాపురం సబ్ కలెక్టర్ ఎం.అచ్యుత్ అంబరీష్, కెనాల్స్ ఈ.ఈ ఎం.దక్షిణామూర్తి, డ్రైనేజీ ఈఈ ఎం.వి.వి కిషోర్, నరసాపురం ఇరిగేషన్ ఏఈఈ మోహన్ కృష్ణ, కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ చందన దుర్గాప్రసాద్, డిప్యూటీ తహసిల్దార్ కె.కల్యాణి పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in