Bhimavaram:భీమవరం: జూన్ 18,2024 ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందనలు
మంగళవారం స్థానిక వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశమై ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఏ విధమైన లోటుపాట్లతో తావు లేనివిధంగా నిర్వహించినందుకు రిటర్నింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ పేరుపేరునా అభినందించారు. ఎన్నికలు ముగియడంతో ఇక నుండి పరిపాలనపరమైన టాస్కులను చేపట్టాల్సి ఉంటుందని, ఇదే స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి సహాయ సహకారాలు అందించాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టరు, ఉండి అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగు అధికారి సి.వి.ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవిన్యూ అధికారి జె.ఉదయ భాస్కర రావు, భీమవరం ఆర్డీవో మరియు రిటర్నింగ్ అధికారి కె.శ్రీనివాసులు రాజు, తణుకు మున్సిపల్ కమీషనరు మరియు రిటర్నింగ్ అధికారి బి.వెంకట రమణ, తాడేపల్లిగూడెం ఆర్డీవో మరియు రిటర్నింగ్ అధికారి కె.చెన్నయ్య, కెఆర్ సి డిప్యూటీ కలెక్టరు మరియు పాలకొల్లు రిటర్నింగు అధికారి బి.శివనారాయణ రెడ్డి, ఏపీ టూరిజం జె.డి మరియు ఆచంట నియోజకవర్గం రిటర్నింగు అధికారి వి.స్వామి నాయుడు తరపున ఆచంట తాహసిల్దార్ ఐపీ శెట్టి, నరసాపురం ఆర్డీవో మరియు రిటర్నింగ్ అధికారి యం.అచ్యుత అంబరీష్ తరపున నర్సాపురం తహసిల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్, జిల్లా కలెక్టరేట్ పరిపాలన అధికారి పి.పాపారావు, ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులు చందన దుర్గ ప్రసాద్, డిప్యూటీ తహాసిల్దార్ ఎం. సన్యాసిరావు, తదితరులు జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా ప్రశంసా పత్రాలను అందుకోవడం జరిగింది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in