Bhimavaram:భీమవరం:మే 21,2024. జిల్లాలో త్రాగునీరు, విద్యుత్తు సరఫరా, జాతీయ ఉపాధి హామీ పనులు, ప్రతి ఒక్కరికీ పని కల్పించుటలో పక్కగా అమలు చేస్తున్నామని, కౌంటింగు, లెక్కింపు, తదితర ఏర్పాట్లును వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.యస్. జవహర్ రెడ్డి కి తెలిపారు
మంగళవారం వెలగపూడి సెక్రటేరియట్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టుట, కూలీలకు ఉపాధి కల్పించుట, వేసవిలో విద్యుత్తు సరఫరా, కౌంటింగు ఏర్పాట్లు, లెక్కింపు, తదితర ఏర్పాట్లు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.యస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా త్రాగునీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఏ చిన్న సమస్య వచ్చినా వెనువెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీటి చెరువులను, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, మంచినీటి చెరువులు నీటి నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులలో నీటి సంరక్షణ పనులు, మంచినీటి చెరువుల డీసిల్టింగ్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని పని అడిగిన ప్రతి ఒక్కరికి పనికల్పించాలన్నారు. విద్యుత్తు సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి చిన్న సమస్యలు తలెత్తినా వెనువెంటనే పరిష్కారం చూపాలన్నారు. కౌంటింగ్ ను ప్రశాంతంగా పూర్తి చేయాలన్నారు. బాటిల్స్, టిన్స్ ద్వారా పెట్రోలు అమ్మకాలను నిలుపుదల చేశామని, పక్కగా అమలు చేయాలన్నారు. బాణాసంచా తయారీ, రవాణా, వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాజ్ఞలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల కౌంటింగు మరియు ప్రకటనలో గెలుపొందిన అభ్యర్ధులు వారి మద్దతుగా విజయోత్సవాలు నిర్వహించే క్రమంలో బాణాసంచా కాల్చడం వాటివల్ల తలెత్తే వివిధ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టంగా నిషేధాజ్ఞలను అమలు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.యస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్, డ్వామా పిడి యం.ప్రభాకర రావు, జిల్లా ఆర్డబ్ల్యూయస్ అధికారి బి.వి.వి. నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఇఇ ఫీర్ అహ్మద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in