Bhimavaram:కౌంటింగ్ సిబ్బందికి తొలి విడత ర్యాండమైజేషన్కౌంటింగ్ సిబ్బందికి తొలి విడత ర్యాండమైజేషన్
భీమవరం, మే 25,2024. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో జూన్ 04వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ చాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, ఎన్.ఐ.సి. అధికారులతో కలిసి శుక్రవారం తొలి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేందుకు, పర్యవేక్షించేందుకు గాను కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు కలిపి 859 మంది అవసరం కాగా రిజర్వ్ సిబ్బందిని కూడా కేటాయిస్తూ మొత్తం 955 మందికి సంబంధించి ర్యాండమైజేషన్ నిర్వహించారు. వారిలో కౌంటింగ్ సూపర్ వైజర్లు 292 మంది ఉండగా, కౌంటింగ్ అసిస్టెంట్లు 346 మంది, మైక్రో అబ్జర్వర్లు 317 మంది ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in