Bhimavaram:ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు నిర్వహణ మెరుగ్గా ఉండాలని జిల్లా కలెక్టరు సి.నాగరాణి సంబంధించిన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు …
గురువారం స్థానిక కలెక్టరేటు ఛాంబరు నందు జిల్లా కలెక్టరు సి.నాగరాణి జిల్లా ఎస్సి,ఎస్టి, బిసి సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమై జిల్లాలోని వసతి గృహాల నిర్వహణపై విస్తృతంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో శాఖల వారీగా ఎన్ని సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వసతి గృహాల స్థితిగతులు, తదితర అంశాలపై ఆరా తీశారు. సంక్షేమ వసతి గృహాలు మెరుగైన రీతిలో నిర్వహణ ఉండాలని, లోపాలు ఉంటే ఉపేక్షించేది లేదన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు చదువులో మెరుగ్గా రాణించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటులో తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. వసతి గృహాలను తరచుగా నేను సందర్శించడం జరుగుతుందని ఏ విధమైన ఫిర్యాదులు లేకుండా వసతి గృహాల నిర్వహణ బాగుండాలన్నారు. జిల్లాలో ఎస్సీ -ప్రీ మెట్రిక్ వసతి గృహాలు 25, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు 13, ఎస్టి పోస్టుమెట్రిక్ వసతి గృహాలు రెండు, బిసి ప్రీ మెట్రిక్ వసతి గృహాలు 14, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు 15 మొత్తం 69 వసతి గృహాలు ఉన్నాయన్నారు. కొన్ని వసతి గృహాల్లో డ్రైనేజీలు, రన్నింగు వాటరు అవసరం ఉందని ఈ సందర్భంగా సంక్షేమ సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టరు స్పందిస్తూ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి అంద చేయాలని ఆదేశించారు. వసతులు లేని కారణంగా సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు చేరకపోవడం, చదువులో వెనకబడటం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని ఈ సందర్భంగా సంక్షేమ శాఖ అధికారులకు జిల్లా కలెక్టరు సి.నాగరాణి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల సంక్షేమ శాఖ అధికారి కె.శోభారాణి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి.పుష్ప రాణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి వి ఆర్ కె ఎస్ ఎస్ గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in