Bhimavaram:జనాభా స్థిరీకరణకు తాత్కాలిక కుటుంబం నియంత్రణ పద్ధతులను విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు తెలిపారు
గురువారం స్థానిక కలెక్టరేట్ జిల్లా రెవిన్యూ అధికారి ఛాంబర్ నందు డిఆర్ఓ జె.ఉదయభాస్కర్ రావు అధ్యక్షత స్టీరింగ్ కమిటీ సభ్యులతో ప్రపంచ జనాభా దినోత్సవం -2024 ను పరిష్కరించుకొని చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాటాడుతూ తల్లి మరియు బిడ్డ శ్రేయస్స్ కోసం సరైన సమయంలో గర్భధారణ మరియు బిడ్డకు బిడ్డకు మధ్య అంతరం” ఉండాలన్నారు. ఇందుకు అర్హులైన దంపతులను గుర్తించి వారు కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంభించేలా ప్రోత్సహించాలన్నారు. బిడ్డకి బిడ్డకి ఎడమ కనీసం మూడు సంవత్సరాలు ఉండాలని వెంట వెంటనే కాన్పులు అయితే ఎనిమియా కారణంగా మాతృ మరణాలు సంభవించే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నారు. జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రత్యేకమైన బాక్స్ లను ఏర్పాటు చేసి వాటిలో నిరోద్, నోటి ద్వారా తీసుకునే మాత్రలు, ఎమర్జెన్సీ పిల్స్ ఉంచడం జరుగుతుందని అవసరమైన వారు వాటిని వినియోగించుకోవచ్చు అన్నారు. పిల్లలు పుట్టకుండా మగవారు వేసక్టమి ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఆంత్రా ఇంజక్షన్లుఫై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఒకసారి ఈ ఇంజక్షన్ చేయించుకుంటే మూడు నెలల కాలం పనిచేస్తుందని, ఇది సురక్షితమైందని తెలిపారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రిలలో ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఇంజక్షన్ ను వేయించుకోవాలని సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం ప్రచార కార్యక్రమాలు జూన్ 1 నుండి ప్రారంభించడం జరిగిందని, జూలై 24 వరకు ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూలై 11న నిర్వహించడం జరుగుచున్నదని, దీనిలో భాగంగా ఈ ప్రచార కార్యక్రమాలను మూడు విడతల్లో నిర్వహించడం జరుగుచున్నదన్నారు. గర్భనిరోధకానికి ఆంత్రా ఇంజక్షన్లపై వాల్ పోస్టరులు, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచార కల్పించాలని తెలిపారు.
ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ డి.మహేశ్వరరావు, డిసీహెచ్ఎస్ సూర్యనారాయణ, ఐసిడిఎస్ పి.డి బి.సుజాత రాణి, విద్యాశాఖ ఎడి సత్యనారాయణ, డిపిఎంఓ ధనలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్వో వి ప్రసాద్, డిపిఓ కార్యాలయం ఏవో రామకృష్ణ, డిపిహెచ్ఎంఓ జి వెంకటరత్నం, డిప్యూటీ డెమో పి. అనంతలక్ష్మి, ఎస్.ఓ ఎంఎస్.ప్రసాద్, డిహెచ్ఈ వి ఎస్ ఆర్ కె కుమారి, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in