Bhimavaram:పిఎంఎవై, టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి. నాగరాణి అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సి.నాగరాణి గృహ నిర్మాణం, టిడ్కో ఇంజనీరింగ్ అధికారులతో జిల్లాలోని గృహ నిర్మాణాలపై సమీక్షించారు. జిల్లాలో పీఎంఏవై అర్బన్ క్రింద 70,119 గృహాలు మంజూరు కాగా, 45,843 గృహ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 29,256 గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందడం అందజేయడం అందడం అందడం అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జిల్లా 64% ప్రగతితో మూడో స్థానంలో నిలిచిందన్నారు. అలాగే పిఎం పీఎంఏవై గ్రామీణ్ కింద 3,673 ఇళ్ళు మంజూరు కాగా 3,290 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని, ఇప్పటివరకు 1,803 ఇళ్ళ నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జిల్లా 55% ప్రగతిలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణాలను ఇదే వరవడిలో కొనసాగించి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణాలకు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
జిల్లాలో రెండు దశల్లో మంజూరైన టిడ్కో గృహ నిర్మాణాలపై సమీక్షించారు. రెండు దశల్లో జిల్లాకు మొత్తం 21,424 ఇళ్లు మంజూరు అయ్యాయాన్ని తెలిపారు. మొదటి విడతలో భీమవరం 8,352, తాడేపల్లిగూడెం 5,376, పాలకొల్లు 6,144 మొత్తం 19,872 ఇళ్ళు మంజూరు కాగా, ఇప్పటివరకు భీమవరంలో 2,944, తాడేపల్లిగూడెంలో 3,232, పాలకొల్లులో 2,560 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా భీమవరంలో 5,408, తాడేపల్లిగూడెంలో 2,144, పాలకొల్లులో 3,584 మొత్తం 11,136 ఇళ్ల నిర్మాణాలు 90 శాతం పైగా పూర్తయినట్లు తెలిపారు. రెండవ విడతలో తణుకు పట్టణంలో 912 ఇళ్ళు మంజూరు కాగా నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు.
గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు సాధ్యమైనంత త్వరగా అందజేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఇన్చార్జి జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, ఈ.ఈ బి.వెంకటరమణ, టిడ్కో ఈ.ఈ ఎం.ఎస్ స్వామి నాయుడు, డిఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in