Bhimavaram:జిల్లాలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారుల ప్యాచ్ వర్క్ లను వెంటనే చేపట్టి, ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం స్థానిక వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ సి. నాగరాణి ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై జిల్లాలోని రహదారుల స్థితిగతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ రహదారులలో గుంతలను వెంటనే పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుంతలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని ఈ విషయమై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి మరమ్మత్తులు చేపట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న రహదారులను వేగవంతంగా పూర్తి చేయాలని, అలాగే కల్వర్టుల మరమ్మత్తులపై శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో అత్యవసరంగా చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణాలు, మరమ్మత్తులకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎల్.లోకేశ్వరరావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసరావు, సంబంధిత శాఖల డి.ఇలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in