Bhimavaram:ప్రభుత్వం నిర్మించే గృహములు నాణ్యతతో ఉండేలా గృహ నిర్మాణ శాఖా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టరు శ్రీమతి సి.నాగరాణి అన్నారు…
శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 46వ హౌసింగ్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కేకును కట్ చేసి గృహ నిర్మాణ శాఖ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ అధికారులు సిబ్బంది ప్రభుత్వం పేదల కొరకు నిర్మించే గృహములు నాణ్యతతో ఉండేలా నిర్మించి, సమిష్టిగా పనిచేసి పశ్చిమగోదావరి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ముందుగా జిల్లా కలెక్టరుకు జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారులు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో గృహానిర్మాణ శాఖ ఇన్చార్జి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, ఈ.ఈ బి.వెంకట రమణ, వి.ఎన్.వేణుగోపాల్, డి.ఈలు ఎన్ వి ఎస్ గోపాల్ రాజు, ఆర్.త్రిమూర్తులు, పి.వెంకటేశ్వరరావు,
పి.శివరామరాజు, కె కె డి టి వరప్రసాదు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు డి.రామకృష్ణ, ఏ ఈ లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in