Bhimavaram:మహిళలందరూ జీవనోపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా రాణించాలని, దీనికి ప్రభుత్వ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు.
శనివారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సి.నాగరాణి డి ఆర్ డి ఏ, మెప్మా అధికారులతో సమావేశమై ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా బలోపేతానికి జీవనోపాధి మార్గాలను ఎంచుకొని రాణించాలన్నారు. లేస్ పార్క్ ఉత్పత్తులను సొసైటీల ద్వారా మార్కెటింగ్ సహాయం తీసుకుని రానున్న రెండు నెలల కాలంలో బలోపేతం చేయాలని ఆదేశించారు. జిల్లా సమైక్య సభ్యులు వివిధ పాఠశాలలకు అవసరమైన హ్యాండ్ వాష్, తదితర వస్తువులను సొంతంగా తయారు చేసి అందించేందుకు ఆలోచన చేయాలన్నారు. ఫిషర్ మెన్ కమ్యూనిటీకి చెందిన మహిళ సమాఖ్య సభ్యులు సోలా డ్రై ఫిష్ యూనిట్స్ నెలకొల్పేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. త్వరలో బి ఎం సి యు ల పనితీరును స్వయంగా పరిశీలించనునట్లు తెలిపారు. మహిళా మార్ట్ లో అమ్మకాలు బాగా పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే మహిళా మార్ట్స్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించి ఏర్పాటుకు సిద్ధం చేయాలన్నారు. అత్తిలి క్లస్టర్ లో మంచిలి పూతరేకులు తయారీలో స్త్రీలు కీలకంగా ఉన్నందున మంచిలి పూతరేకుల తయారీ ని పరిశీలించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎన్ఎస్ఎస్ వేణుగోపాల్, మెప్మా పీడీ గ్రంధి పార్వతి, డి ఆర్ డి ఎ, మెప్మా అధికారులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in