Bhimavaram:విద్యార్థులు ఉన్నతంగా విద్యను అభ్యసించేందుకు అనువైన వాతావరణాన్ని వసతి గృహాల్లో కల్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి సి.నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం భీమవరం గునుపూడి ఏరియాలో బి.సి ఫ్రీ మెట్రిక్, ఎస్సీ ప్రీమిట్రిక్, ఎస్సీ గర్ల్స్ కాలేజీ హాస్టల్ క్యాంపస్ ను, శివరావు పేటలో ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీమతి సి.నాగరాణి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వసతి గృహాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్ధినులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతి పై ఆరా తీశారు. విద్యార్ధినులను పలు ప్రశ్నలు అడిగి జిల్లా కలెక్టరు సమాధానాలను రాబట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మంచిగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందని, అప్పుడే మీ కలలు సాకారం అవుతాయని అన్నారు. అన్ని విషయాలపై పూర్తి పరిజ్ఞానం కలిగినప్పుడే చదువులో కూడా మరింత రాణించగలరని అన్నారు. చదువుతోపాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వసతి గృహంలో ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని తన దృష్టికి తేవాలని విద్యార్థులతో కలెక్టర్ అన్నారు. విద్యార్థుల రూమ్స్ ను, వారు ఉపయోగించే టాయిలెట్స్ నేరుగా వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు భోజన సదుపాయాల్లో ఎటువంటి లోపం లేకుండా నాణ్యత పాటించాలని వసతి గృహాల అధికారులను ఆదేశించారు.
వారంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని మంచి భవిష్యత్తును పొందాలని కలెక్టర్ శ్రీమతి నాగరాణి ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ వసతి గృహాల తనిఖీ సందర్భంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి వి ఆర్ కె ఎస్ ఎస్ గణపతి రావు, జిల్లా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి సిహెచ్ భానుమనీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి పుష్పరాణి, భీమవరం డివిజన్ అసిస్టెంట్ బిసి సంక్షేమ అధికారి కె. వెంకటేశ్వరరావు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in