BhimavaramBhimavaram
0 0
Read Time:7 Minute, 53 Second

Bhimavaram:పని చేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే దిశగా జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటుకు శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి తెలిపారు.

పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేదింపుల చట్టం – 2013 (నివారణ, నిషేథము మరియు పరిహారం) పై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నందు జిల్లా అధికారులు, స్ధానిక ఫిర్యాదుల కమిటీ నోడల్ అధికారులతో నిర్వహించిన శిక్షణ తరగతులకు జిల్లా కలెక్టర్ సి.నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్  సి.నాగరాణి మాట్లాడుతూ అవాంఛనీయ చర్యలు లేదా లైంగికత్వంతో కూడిన ప్రవర్తన, ప్రతికూలమైన వాతావరణాన్ని సృష్టించడం ఈ చట్టం స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తుందన్నారు. పది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించిందన్నారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు, సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి ఈ కమిటీ బాధ్యత వహిస్తుందన్నారు.జిల్లా లో ఇప్పటివరకు మహిళలపై లైంగిక వేధింపుల నిరోధించే కమిటీలు చాలా తక్కువ శాఖలులో మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందని, మిగతా శాఖల్లో వెంటనే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2013 మహిళా హక్కుల పరిరక్షణలో భాగంగా పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించడానికి ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నర్సింగ్ హోమ్ లు, పరిశ్రమలు, క్రీడా సంస్థలు, హాస్పిటల్స్, సహకార సంస్థలు, విద్యాసంస్థలు, కార్పొరేషన్లు, స్వయం ఉపాధిలు, బ్యాంకులు, మరే ఇతర పనిచేసే చోటనైనా పదిమంది అంత కన్నా ఎక్కువగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర ప్రాంతాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు స్వేచ్చగా భద్రత కలిగి ఏదైనా వృత్తి, వ్యాపారం లేదా వ్యాపారాన్ని నిర్వహించడానికి అనువైన వాతావరణం కలిగి ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. పనిచేసే ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ కింద ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం  స్థానిక ఫిర్యాదుల సెక్షన్ కింద లోకల్ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. కార్యాలయంలోని అడ్మి నిస్ట్రేటివ్ యూనిట్‌లలో సీనియర్ స్థాయి మహిళా ఉద్యోగి లేకుంటే, ప్రిసైడింగ్ అధికారిని, యజమాని లేదా ఇతర శాఖ లేదా సంస్థ యొక్క ఏదైనా ఇతర కార్యాలయం నుండి నామినేట్ చేసే అధికారం ఉందన్నారు. మహిళల భద్రత విషయానికి ప్రాధాన్యతనిస్తూ లేదా సామాజిక సేవలో అనుభవం ఉన్నవారు లేదా చట్టపరమైన పరిజ్ఞానం ఉన్న ఉద్యోగుల నుండి ఇద్దరు సభ్యుల కంటే తక్కువ కాకుండా కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయి కమిటీలో చైర్ పర్సన్ గా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి, సభ్యులుగా సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, న్యాయమూర్తి, సఖి సెంటర్ కౌన్సిలర్, ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి లను నియమించడం జరిగిందని తెలిపారు.

న్యాయవాది మరియు కమిటీ సభ్యులు మైలాబత్తుల చిత్ర భాను మాట్లాడుతూ పనిచేసిన ప్రదేశంలో ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్న వెంటనే సాక్ష్యధారలతో ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. కనీసం సంఘటన నాటి నుండి మూడు నెలల లోపు సాక్ష్యధారాలతో అందించిన ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. పాత సంఘటనలు తెలియజేస్తూ ఇచ్చే ఫిర్యాదులు పరిగణలోనికి రావన్నారు. ఇంటర్నల్ కమిటీ, లోకల్ కమిటీలో మాత్రమే ఫిర్యాదులు చేయాలని నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి లేదని స్పష్టం చేశారు. ఏదైనా ఫిర్యాదుపై ఇంటర్నల్ కమిటీ, లోకల్ కమిటీ విచారణలోని నివేదిక ఫైనల్ గా ఉంటుందని, ఇదే ఫిర్యాదుపై మరొకసారి విచారణ ఉండదని స్పష్టం చేశారు. ఇంటర్నల్ కమిటీ, లోకల్ కమిటీలకు అందజేసిన ఫిర్యాదులోని విషయాన్ని విచారణ పూర్తికాకుండానే బహిర్గతం చేయరాదని, ఒకవేళ దోషిగా తేలితే పేర్లు ప్రస్తావించకుండా మాత్రమే తెలియజేయాలని చట్టం పేర్కొందన్నారు. విచారణ అనంతరం తప్పుడు ఫిర్యాదుగా తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకొనే వెసులుబాటు కమిటీకి ఉందని స్పష్టం చేశారు.

తొలుత జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాజేష్ చట్టంపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

చివరిగా చట్టం అవగాహఫై రూపొందించిన గోడ ప్రతిని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.వి ప్రవీణ్ ఆదిత్య, డిఆర్ఓ జె.భాస్కరరావు, కమిటీ చైర్ పర్సన్ మరియు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి (ఐ సి డి ఎస్) బి.సుజాత రాణి, సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ స్వర్ణలత, న్యాయవాది మైలాబత్తుల చిత్ర భాను, ఎక్స్ ఆఫీషియో మెంబర్ మరియు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి కె.శోభరాణి, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *