Bhimavaram: జూలై 8,2024 జిల్లాలో బాల్య వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలులేదని, బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలలో మాత్రమే ఉంచాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు .
సోమవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సి.నాగరాణి జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖలో అమలు జరుగుచున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని, బడిఈడు గల ఆడపిల్లలను చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. చదువు యొక్క ప్రయోజనాలు, వారి భవిష్యత్తు అన్ని అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అలాగే జిల్లాలో బాల కార్మికులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్నారు. పని ప్రదేశాల్లో తరచూ తనిఖీలు చేయడంతో పాటు, సంబంధిత యజమానులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తనిఖీల్లో ఎవరైనా పిల్లలు పట్టుపడితే పాఠశాలలో చేర్పించి, బడికి సక్రంగా వెళుతున్నది లేనిది తరచూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్లల నిర్వహణ పక్కాగా ఉండాలని, పిల్లలకు, తల్లులకు, బాలింతలకు అందించే పౌష్టికాహారం సక్రమంగా అందించాలన్నారు. హాజరు పక్కాగా నమోదు కావాలన్నారు. ఏదైనా అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంగన్వాడి సెంటర్ ను, వన్ స్టాప్ సెంటర్ ను త్వరలో సందర్శించడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు సూచించిన యాప్ ల నందు వివరాలను ఏరోజుకారోజు తప్పకుండా అప్డేట్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమములో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, సిడిపిఓలు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఆర్.రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in