Bhimavaram: జూలై 9,2024 కాలానుగుణ వ్యాధులనుండి రక్షణ పొందేందుకు విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమావేశమై ఆయా శాఖలలో జరుగుచున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ జిల్లా అంతటా కంటికి కనిపించేంత స్పష్టంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం సీజన్లో డయోరియా, డెంగ్యూ, జ్వరాలు తదితర వ్యాధులు అపరిశుభ్రత, నీటి కలుషితం కారణంగా ప్రభలుతాయన్నారు. ఎక్కడ చెత్తకుప్పలు, తాగునీటి పైప్ లైన్ లు లీకేజీలు లేకుండా చూడాలన్నారు. వీధుల్లో, షాపులు ముందు, డ్రైనేజీల్లో చెత్త వేయకుండా నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే చెత్త వేసేల ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. తడి, పొడి చెత్తలను వేరువేరుగా ఉంచి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉదయం కనీసం రెండు గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటరీ పనులను క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. డ్రైన్స్ లో డీసిల్టింగ్ పనులను వెంటనే చేపట్టాలన్నారు. తొలుత మున్సిపాలిటీలు వారీగా చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆయా మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నరసింహ రాజు, పబ్లిక్ హెల్త్ ఎస్.ఇ ఏ.సుధాకర్, భీమవరం మున్సిపల్ కమిషనర్ శ్యామల, ఈఈ త్రినాధరావు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారి విజయ్, మున్సిపల్ కమిషనర్లు, సహాయ మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి.. జిల్లా కలెక్టర్
మంగళవారం సాయంత్రం స్థానిక వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సి.నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఎంపీడీవోలు, ఇఓపిఆర్డీలు, పంచాయతి సెక్రటరీలతో పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ గ్రామాల్లో నూరు శాతం పారిశుద్ధ్య కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలన్నారు. చెత్త మేట వేసిన ప్రదేశాలను గుర్తించి జెసిబి లను ఉపయోగించి ట్రాక్టర్ల ద్వారా తరలించాలన్నారు. శానిటేషన్ లోపిస్తే ఆ ప్రాంతంలో డయోరియా, డెంగ్యూ, జ్వరాలు విజృంభిస్తాయని, ఇటువంటి పరిస్థితి రాకముందే నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా చేపట్టాలన్నారు. వర్షాలు కారణంగా కొబ్బరి బొండాలు, టైర్లు, కుండీలు తదితరాలలో నీళ్లు నిలవకుండా జాగ్రత్త పడాలన్నారు. డ్రైన్స్ లో నీటిపారుదలకు ఆటంకం లేని విధంగా డీసిల్టింగ్ చేయాలని, మట్టిని దూరంగా ఒక ప్రాంతంలో వేయాలన్నారు. వాటర్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా శుభ్రం చేయాలని, శుభ్రం చేసిన తేదీలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. వాటర్ ట్యాంకులపై మూతలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని, అలా చేయకపోతే ఏదైనా పక్షులు, ఎలుకలు, ఉడతలు వంటివి నీటిలో చనిపోవడం వల్ల నీరు కలుషితమై డయోరియా ప్రభలతుందన్నారు. తక్కువ ఎత్తులో గుంటలో ఉండే పంపులను గుర్తించి నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా అందించిన ఫాగింగ్ మిషన్ లు, తదితర పనిముట్లను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. త్రాగునీటి పైపులైన్ల లీకేజీలను వెంటనే అరికట్టాలని తెలిపారు. సరైన మోతాదులో తాగునీటిని క్లోరినేషన్ చేసిన పిదప మాత్రమే తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. గతంలో డయేరియా ప్రభలిన ప్రాంతాలను తెలుసుకొని ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలలో వంట చేసే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని, గంజిని నేలపై కాకుండా ఒక గిన్నెలోనికి వంచి దూరంగా పారపోయాలన్నారు. చేపల చెరువుల నీటి కారణంగా త్రాగునీటి వనర్లు కలుషితం కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జన సమర్థంగా ఉన్న ప్రాంతాలు, మార్కెట్ యార్డులు, చర్చిలు, మసీదులు, దేవాలయాల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి హేబిటేషన్, మండల స్థాయిలో పారిశుద్ధ్య పర్యవేక్షణకు సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రతిరోజు శానిటేషన్ పై ఆరా తీయాలి అన్నారు. ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది ఒక టీం గా ఏర్పడి పారిశుద్ధ్యం పై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు.
పంచాయతీ స్థాయిలో పరిష్కరించాల్సిన చిన్న చిన్న సమస్యలు కూడా జిల్లా స్థాయి గ్రీవెన్స్ కు వస్తున్నాయని ఇటువంటి వాటిపై పంచాయతీ సెక్రటరీలు, ఈవోపీఆర్డిఓలు తగు శ్రద్ధ తీసుకొని న్యాయబద్ధంగా పరిష్కరించాలని సూచించారు.
జూమ్ కన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి విక్టర్, ఇంచార్జ్ జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి వివి నాగేశ్వరరావు, భీమవరం డి ఎల్ డి వో అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in