Bhimavaram: జూలై 9,2024 జాతీయ రహదారుల భూ సేకరణలో ఎన్యుమరేషన్ ఖచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య సర్వే అధికారులను ఆదేశించారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య సర్వే అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ హైవేస్ భూ సేకరణలో భాగంగా ఆయా భూముల్లో ఉన్న ఇళ్ళు, షెడ్లు, చెట్లు వంటి వాటిని కచ్చితంగా లెక్కించాలన్నారు. భూసేకరణలో భాగంగా ఎన్యుమరేషన్ నిర్వహించేందుకు టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, టీం లో ఇచ్చిన రిపోర్ట్లను తిరిగి తనిఖీ చేసేందుకు మరొక టీం లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆకివీడు, ఉండి, కాళ్ళ, భీమవరం, పాలకొల్లు, పాలకోడేరు, వీరవాసరం మండలాల్లో భూసేకరణ పనులు జరుగుతున్నాయన్నారు. సర్వే పై అందుతున్న ఫిర్యాదులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మనం చేసే పనిలో ప్రజల నమ్మకం కోల్పోకూడదని సూచించారు. ఎఫ్ లైన్, సబ్ డివిజన్, పి జి ఆర్ ఎస్ సర్వేలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. 22 ఏ కేసులను కూడా త్వరగా పరిష్కరించాలని ఆర్డీవోలను, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె .శ్రీనివాసులు రాజు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎస్.లోకేశ్వరరావు, కలెక్టరేట్ ల్యాండ్ సూపర్డెంట్ సి హెచ్ రవికుమార్, డిప్యూటీ సర్వే అధికారులు, మండల సర్వేలు అధికారులు తదితరులు పాల్గొన్నారు,
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in