Bhimavaram: జూలై 10,2024 భీమవరం ఏరియా ఆసుపత్రి నందు జిల్లా స్థాయి సేవలు అందించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి తెలిపారు.
బుధవారం భీమవరం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సి. నాగరాణి ఆకస్మికంగా తనిఖీచేసి, ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా ప్రసూతి వార్డు, మందులు నిల్వ కేంద్రం, పరిపాలన, ఓపి విభాగాలు, ల్యాబ్, స్కానింగ్, ఎక్సరే యూనిట్లను పరిశీలించి సంబంధిత వైద్యులకు సూచనలు జారీ చేశారు. తొలుత ప్రసూతి వార్డు సందర్శించి నవజాత శిశువులను, తల్లులకు అందుతున్న వైద్య సహాయం పై ఆరా తీశారు. నవజాత శిశువు గుండె పనితీరును పరిశీలించే సి.టి.జి మిషన్స్ ఎన్ని ఉన్నాయి, వినియోగంలో ఉన్నాయా అని అడిగి తీసుకున్నాను అనంత తెలుసుకున్నారు. అనంతరం నవజాత శిశువుల ఓర్మర్, ఫోటో థెరఫీ యూనిట్లను పరిశీలించారు. ప్రసూతి మహిళలు, గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ ఆసుపత్రి నందు ప్రసవాలు ఎలా జరుగుతున్నాయి, యాంటినెంటల్ చెక్ అప్ లు బాగా జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వార్డులో చికిత్స పొందుతున్న 18 ఏళ్ల యువతితో మాట్లాడుతూ ఏ విషయమై చికిత్స పొందుతున్నారు అని ఆరా తీశారు. వ్యక్తిగత కారణాలతో పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని డి సి హెచ్ ఎస్ వివరించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆత్మహత్య పాల్పడిన యువతిని సున్నితంగా మందలించారు. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదని, సమస్య పరిష్కారానికి ఆలోచనతో ముందు సాగాలని హితవు పలికారు. మందుల విభాగాన్ని పరిశీలించిన సందర్భంలో కాల్ పరిమితి ముగిసిన మందులను సంబంధిత రిజిస్టర్ నందు నమోదు చేసి, ఆ మందులను విడిగా భద్రపరచాలన్నారు. ఎప్పటికప్పుడు మందుల ఎక్స్పైరీ డేట్ లను పరిశీలించుకోవాలని సూచించారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రసూతి మహిళలు నవజాత శిశువులకు చనుబాలను అందించే సందర్భంలో ఎదురయ్యే ఇబ్బందులను సరి చేయడానికి షుషాన్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఎల్.సి.యు యూనిట్ ఎంతవరకు వచ్చింది అని ఆరా తీశారు. ఈ యూనిట్ వలన తల్లి చనుబాలను బిడ్డకు సరిగ్గా అందించలేని సమయంలో తల్లిపాలను యూనిట్ ద్వారా సేకరించి బిడ్డకు అందించడానికి వీలవుతుంది. ప్రస్తుతం భీమవరం ఏరియా ఆసుపత్రి 50 పడకల స్థాయిలో కొనసాగుతుందని, నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే వైద్య సేవలను మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుంది అని హాస్పిటల్స్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ డా.పి.సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఆస్పత్రి పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ మెడికల్ సూపరింటెండెంట్ కు పలు సూచనలు చేశారు. ఓపి విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని, రోగులకు అందిస్తున్న సేవలను విస్తృతపరచాలని సూచించారు. అలాగే ఓపి విభాగం హాల్లో రోగులు కూర్చోవడానికి ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆసుపత్రి నందు డెలివరీలు ఎక్కువగా జరిగేలా ప్రోత్సహించడంతోపాటు, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని తెలిపారు.
ఆస్పత్రి పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా ఈరోజు భీమవరం ఏరియా హాస్పిటల్ ను సందర్శించడం జరిగిందన్నారు. ఆసుపత్రి నందు అన్ని విభాగాలను పరిశీలించడం జరిగిందని, చికిత్స పొందుతున్న రోగులతో కూడా మాట్లాడటం జరిగిందని తెలిపారు. ఆసుపత్రి నందు అందుతున్న సేవలపై రోగులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇంకా మెరుగైన వైద్య సహాయం రోగులకు అందించాలని, ఈ సందర్భంలో వైద్యులకు పలు సూచనలు చేసినట్లు వివరించారు.
జిల్లా కలెక్టర్ ఆసుపత్రి తనిఖీ సందర్భంగా హాస్పిటల్స్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ డా.పి.సూర్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ డా. మాధవి కళ్యాణి, ఆర్ ఎం ఓ డా.ప్రవీణ్, వైద్యులు, ఆస్పత్రి వైద్యతర సిబ్బంది, తదితరులు ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in