Bhimavaram:బుధవారం స్థానిక కలెక్టరేట్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మత్స్య శాఖలో అమలవుతున్న పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పి.ఎం.ఎస్.ఎస్.వై., మరియు పి.ఎం.ఎఫ్.ఎం.ఈ పథకాలు అమలు ద్వారా మత్స్యకారుల ఉపాధికి దోహదపడాలన్నారు. మత్స్యకార మహిళలకు ఉపాధి అవకాశంలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ సబ్సిడీ యూనిట్ ల కింద రొయ్యలు ఒలిచి పెద్ద ప్రాసెసింగ్ యూనిట్లకు సరఫరా చేసేలా రొయ్యల షెలింగ్ షెడ్లు ఏర్పాటుకు రుణాలను మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యకార కుటుంబాలలో పిల్లలు విద్యను అభ్యసించేందుకు మెరుగైన అవకాశాలను కల్పించాలన్నారు. జిల్లాలో మొత్తం 1,24,735 ఎకరాల్లో 24,677 రైతుల కింద ఆక్వా సాగు జరుగుతుందన్నారు. ఆక్వాజోన్ 1,16,257 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. జిల్లాలో 20 ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నారు. అప్సదా యాక్ట్ కింద 48,867.94 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగుకు లైసెన్సులు జారీ చేయడం జరిగిందన్నారు. 16,234 ఆక్వా ఎలక్ట్రిసిటీ సర్వీస్ కనెక్షన్స్ ఉండగా, 13,827 కనెక్షన్లకు ఎలక్ట్రిసిటీ సబ్సిడీకి అర్హతగా ఉన్నాయన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, జిల్లా మత్స్య శాఖ అధికారి ఆర్ వి ఎస్ వి ప్రసాద్, బి.ఎఫ్.ఓలు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in