Bhimavaram:జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఆయకట్టు పరిధిలోని కాలువల్లో 49 గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపు పనులకు రూ.545.79 లక్షలు, డ్రెయిన్స్ కు సంబంధించి 35 పనులకు రూ.592.59 లక్షలు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు .
కాలువలకు సంబంధించి జిల్లాలో 49 గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపు పనులకు రూ.545.79 లక్షలు, డీసిల్టింగ్, షట్టర్ల మరమ్మతులు, ఇతర పనుల నిమిత్తం మొత్తం 90 పనులకు రూ.848.91 లక్షలు మంజూరుకు ప్రతిపాదలను కడా కార్యాలయమునకు ఆమోదం నిమిత్తం సమర్పించడం జరిగిందన్నారు. వీటిలో 49 కలుపు తొలగింపు పనులకు రూ.545.79 లక్షలు మంజూరయ్యాయని, వీటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 45 పనులకు సంబంధించి ఏజెన్సీలను నిర్ణయించి పనులను అప్పగించడం జరిగిందన్నారు. వీటిలో 6 కలుపు తొలగింపు పనులకు సంబంధించి ఎనిమిదో తేదీ సోమవారం నుండి పనులు ప్రారంభించడం జరిగిందని, మిగిలిన పనులు జూన్ 12 నుండి ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
నిడదవోలు గోదావరి పశ్చిమ డివిజన్ క్రింద పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో 5,29,962 ఎకరాల ఆయకట్టు ఉందని, దాదాపు 357 కిలోమీటర్ల పొడవుగల 11 ప్రధాన కాలువల ద్వారా, సుమారు 1,766 కిలోమీటర్ల పొడవున నిడదవోలు మరియు పశ్చిమగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో నీటి పంపిణీ జరుగుతుందన్నారు.
అలాగే భీమవరం డ్రైనేజీ డివిజన్‌కు సంబంధించి 40 గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపు పనులకు రూ.914.46 లక్షలు, 57 డీసిల్టింగ్ పనులకు రూ.712.48 లక్షలు ప్రతిపాదనలను ఆమోదం కొరకు కడా కమిషనర్ కార్యాలయంనకు సమర్పించడం జరిగిందన్నారు. వీటిలో 35 కలుపు తొలగింపు పనులకు రూ.592.59 లక్షలు మంజూరయ్యాఅని తెలిపారు. జూలై 8వ తేదీ సోమవారం నుండి 12 పనులను చేపట్టడం జరిగిందన్నారు. మిగిలిన పనులు నేటి నుండి (బుధవారం) ప్రారంభించడం జరిగిందన్నారు.
గోదావరి పశ్చిమ డెల్టాలో 13 మేజర్, 41 మీడియం, 454 మైనర్ డ్రెయిన్లు ఉన్నాయని తెలిపారు. డెల్టాలోని మొత్తం ఆయకట్టు ప్రాంతంలో 3,78,745 లక్షల ఎకరాల పరిధిలో ఇవి వినియోగంలో ఉన్నాయని తెలిపారు. ప్రధాన కాలువల మొత్తం పొడవు సుమారు 295 కి.మీలు కాగా, మీడియం 328 కి.మీలు, మైనర్ కాలువలు దాదాపు 959 కి.మీలు మేర ఏడు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయని తెలిపారు.
మంజూరైన ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా పనులను నాణ్యతతో పూర్తి చేసేందుకు స్థానిక రైతులకు సమాచారం అందించి వారి పర్యవేక్షణలో పనులను చేపట్టడం జరుగుతుందని, స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా ముందస్తు సమాచారాన్ని అందించి పనులను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆ ప్రకటనలో తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in