Bhimavaram:జూలై 10,2024. జిల్లాలో ట్రాన్స్‌జెండర్లు సంక్షేమానికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టరు సి.వి.ప్రవీణ్ ఆదిత్య అన్నారు …
బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.వి ప్రవీణ్ ఆదిత్య ట్రాన్స్ జెండర్ ల సమస్యల పరిష్కారానికి సమావేశాన్ని సంబంధిత అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్స్ కి ఆధార్ కార్డు, పెన్షన్ మంజూరు, స్వంతంగా వ్యాపారం నిర్వహించుకునేందుకు ప్రభుత్వ రుణాలు, అర్హులైన వారికి రేషన్ కార్డు మంజూరు వంటి వాటికి చర్యలు తీసుకుంటామన్నారు. స్వంతంగా స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కొరకు, స్థలం లేనివారికి స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వ పరంగా మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో మరొక సారి సమావేశం ఏర్పాట్లు చేస్తామని ముందుగా తెలియజేస్తామని, తమ సమస్యల అర్జీల రూపంలో ఇవ్వవచ్చునని తెలిపారు. ఏటువంటి ధ్రువపత్రాలు కావాలన్నా, సంక్షేమ పథకాలు కావాలన్నా సంబంధిత పత్రాలతో దగ్గరలో ఉన్న సచివాలయాలలో దరఖాస్తు చెయ్యాలని, పరిశీలించి నిర్ణీత గడువులోగా మంజూరు అవుతాయని, ఇబ్బందులు తలెత్తితే మండల తహాశీల్దారు గాని తమకు గాని తెలియజేయవచ్చునని జిల్లా జాయింటు కలెక్టరు సి.వి.ప్రవీణ్ ఆదిత్య తెలిపారు.
ఈ సమావేశంలో ట్రాన్స్‌జెండర్లు మాట్లాడుతూ ఆధారు కార్డులు లేవని, కొంతమందికి అధారు కార్డులో తప్పులు సరిచెయ్యాలని, తెలుపు రేషన్ కార్డులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేయగా జిల్లా జాయింటు కలెక్టరు సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.డి మహేశ్వర రావు, డియస్ వో యన్.సరోజ, డియార్డీఏ పిడి యం.యస్.యస్.వేణుగోపాల్, ఏయస్ వో యం.రవి శంకర్, సుమారు 50 మంది ట్రాన్స్ జెండర్లు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in