0
0
Read Time:1 Minute, 16 Second
Bhimavaram:బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబరులో జిల్లా కలెక్టరు సి.నాగరాణిని ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణం రాజు మర్యాద పూర్వకంగా కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఉండి నియోజక వర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టరుతో శాసనసభ్యులు చర్చించారు. అనంతరం జిల్లా జాయింటు కలెక్టరు సి.వి.ప్రవీణ్ ఆదిత్యను వారి ఛాంబరు నందు మర్యాద పూర్వకంగా శాసన సభ్యులు కనుమూరి రఘురామ కృష్ణం రాజు కలిశారు.
ఈ సందర్భంలో జిల్లా రెవిన్యూ అధికారి జె.ఉదయ భాస్కర రావు వున్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in